
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : రాష్ట్రంలో నేతన్నల ప్రభావం పెరుగుతుంది. తన చేనేత వైభవాన్ని ప్రపంచం నలుమూలలా చాటుతున్నారు. గతంలో పూట గడవక, తాము చేసిన పనికి ప్రభుత్వాలు గుర్తింపు నివ్వక, చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడిన చేనేతన్నలు ఇపుడు సగర్వంగా తమ పనితనానికి పదును పెడుతున్నారు. అగ్గిపెట్టె, దబ్బనంలో పట్టే చీరతో పాటు..సుగంధాలు వెదజల్లే చీరలు నేసి మగువల మనసు దోచుకున్న ఒకప్పటి చేనేత నైపుణ్యం ఇప్పుడు, తాజాగా మరో అద్భుతం ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. తాజా సమాచారం ప్రకారం ధర్మవరం నేతన్న, తమ పనితనంతో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తూ..చేనేత వైభవాన్ని ప్రపంచానికి చాటుతున్నారు.
Also Read : టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కూతురు సూసైడ్!
అగ్గిపెట్టె, దబ్బనంలో పట్టే చీరతో పాటు..సుగంధాలు వెదజల్లే చీరలు నేసి మగువల మనసు దోచుకున్నారు. తాజాగా మరో అద్భుతానికి ప్రాణం పోశారు ధర్మవరం నేతన్న. దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అయోధ్య రామాలయానికి అందించేందుకు ఒక పట్టు వస్త్రాన్ని తయారుచేశారు. ఈ వస్ర్తంలో ఎన్నో ప్రత్యేకతలను పొంది పరిచి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ పట్టువస్త్రంలో ప్రతి అణువుకి ఓ ప్రత్యేకత ఉంది. 180 అడుగుల పొడవు, 44ఇంచుల వెడల్పుతో 16కిలోల బరువుతో ఈ పట్టు వస్త్రం తయారుచేశారు.
ఇందులో సప్తవర్ణాలు మిళితమై ఉంటాయి. అంతేకాదు. వస్త్రం అంచుల్లో రామాయణానికి సంబంధించిన 168 రకాల చిత్రాలను కూడా ముద్రించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం ఇలా మొత్తం 13భాషల్లో జై శ్రీరామ్ అన్న అక్షరాలను కూర్చారు. ధర్మవరం పట్టణానికి చెందిన డిజైనర్ నాగరాజు ఆధ్వర్యంలో నలుగురు చేనేతల కార్మికులు, 4 నెలల పాటు శ్రమించి ఈ వస్త్రాన్ని తయారుచేసినట్లు తెలుస్తుంది. చేనేత మగ్గంపై రూపొందించిన శ్రీరామకోటి పట్టు వస్త్రాన్ని అయోధ్యలోని శ్రీరామ మందిరానికి బహూకరించనున్నట్లు డిజైనర్ నాగరాజు తెలిపారు.
ఇవి కూడా చదవండి ..
- సార్ వచేదెప్పుడో- తనిఖీలు చేసేదెప్పుడో.. కానరాని ఫుడ్ ఇన్స్పెక్టర్
- అధికారుల అవినీతిపై కమీషనర్ కన్నెర్ర
- నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి…
- మోడీ వేస్ట్.. సీజేఐ గ్రేట్! సీఎం కేసీఆర్ సంచలనం..
- వాలంటీర్లకు ప్రసన్నకుమార్ రెడ్డి పిలుపు..
2 Comments