Andhra Pradesh

కేబినెట్ కూర్పులో బీజేపీ మార్క్! జగన్ జగమెండి కాదా?

క్రైమ్ మిర్రర్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం కొలువు దీరింది. మొత్తం మంత్రులను జగన్ మారుస్తారని ప్రచారం జరిగినా… పాత వారిలో 11 మందిని కొనసాగించారు. కొత్తగా 14 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు జగన్. కొత్త టీమ్ లో సామాజిక కూర్పు ఉండేలా చేశారు. జగన్ టీమ్ లో ప్రస్తుతం 10 మంది బీసీ మంత్రులు ఉండగా.. నలుగురు రెడ్లు, నలుగురు కాపులు, ఐదుగురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఒక మైనార్టీకి అవకాశం దక్కింది. అయితే మంత్రి పదవి ఆశించిన కొందరు సీనియర్ నేతలకు ఛాన్సా రాలేదు. దీంతో వాళ్లంతా ఆగ్రహంగా ఉన్నారు. మాజీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఏకంగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశారు.

Read More : ఆశావహుల్లో నిరసన జ్వాల… రోడ్డెక్కిన అసమ్మతి

అయితే జగన్ కేబినెట్ కూర్పులో పొరుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతల ఒత్తిళ్లు, ఇంకొందరి విషయంలో సొంత కుటుంబం నుంచే ఒత్తిళ్లు జగన్ పై పని చేశాయని, అందుకే ఆయన కేబినెట్ మొత్తాన్ని కాకుండా సగాన్నే ప్రక్షాళన చేశారని అంటున్నారు. కర్ణాటక బళ్లారికి చెందిన బీజేపీ నేత శ్రీరాము లు సిఫారసును గౌరవించే జగన్.. గుమ్మనూరు జయరాంకు మళ్లీ మంత్రిగా అవకాశం కల్పించారని అంటున్నారు. జగన్ తల్లి తరఫు సమీప బంధువైన బాలినేని శ్రీనివాస రెడ్డి తిరిగి మంత్రిపదవి పొందేందుకు మంకుపట్టుపట్టారని, ఈ విషయంలో సీఎం ఇరుకునపడ్డారని చెబుతున్నారు. బొత్స సత్యనాయారణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్లను తొలగించలేని స్థితిలో జగన్ పడ్డారనే టాక్ వస్తోంది. కొత్త మంత్రి వర్గ కూర్పులో జగన్ నిస్సహాయత కనిపించిందని, ఫైనల్ లిస్టులోని పేర్లు చేర్చుతూ, తీస్తూ కసరత్తుచివరి నిమిషందాకా సాగిందనే ప్రచారం జరుగుతోంది.

Read More : మినిస్టర్ గా ఫైర్ బ్రాండ్.. చంద్రబాబుకు ఇక బ్యాండ్

సీఎం నిర్ణయాన్ని ఇప్పటివరకు ఎవరూ ధిక్కరించిందీ లేదు. అలాంటిది కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశంలో మాత్రం తొలిసారి జగన్ తీరుపై విమర్శలు, ఆయన నిర్ణయాలపై వ్యతిరేకత బాహాటంగా వ్యక్తమవుతోంది. చాలా జిల్లాల్లో ఆయా నేతల అనుచరులు రోడ్లపైకొచ్చి రాస్తారోకోలు, టైర్లకు నిప్పుపెట్టి ఆందోళనలకు చేయడాలు లాంటివి వైసీపీలో తొలిసారి చోటుచేసుకున్న పరిణామాలు.జగమెండి అని చెప్పుకునే జగన్ తొలిసారి ఒత్తిళ్లకు తలొగ్గారని, ఆయనలో నిస్సహాయత బహిరంగంగా వెల్లడైందనే వాదనలూ వినిపిస్తున్నాయి..

ఇవి కూడా చదవండి ..

  1. కేబినెట్ కూర్పులో బీజేపీ మార్క్! జగన్ జగమెండి కాదా?
  2. వెంకట్ రెడ్డికి కీలక పదవి.. రాజగోపాల్ రెడ్డి దారెటో?
  3. కేబినెట్ విస్తరణతో… బయిట పడుతున్న అసంతృప్తులు
  4. ధనిక తెలంగాణలో 10వ తేదీ వచ్చినా జీతాల్లేవ్!
  5. జగన్ టీమ్ లో రోజా, రజని… విలపించిన శ్రీధర్

ad 728x120 Garuda copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.