
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజుశ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 19 న ఈ కుంభోత్సవం నిర్వహించబడుతుంది. అమ్మవారికి సాత్మికబలి’ నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు,గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.
కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పించడం. జరుగుతోంది. ఇందులో భాగంగా అనగా శక్రవారం (08.04.2022) అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించబడ్డాయి.ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించడం జరిగింది. తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించబడ్డాయి.
ఇవి కూడా చదవండి ..
- యూట్యూబ్ జర్నలిస్ట్ లను స్టేషన్లో చెడ్డీలపై నిలబెట్టిన పోలీసులు
- ఉచిత వైద్యం కోసం ఆయుష్మాన్ భారత్ ను అమలు చేయాలి.. సామ రంగారెడ్డి
- గుట్టల బేగంపేటలో పలువురికి అస్వస్థత..ఒకరు మృత
- హీరోగా ‘బాహుబలి’ ప్రభాకర్.. సినిమా షురూ..
- డబ్బుల కోసం 90 సార్లు కొవిడ్ వ్యాక్సిన్!
One Comment