Andhra Pradesh

జగన్ కు సీనియర్ మంత్రుల ఝలక్?

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు రంగం సిద్ధమైంది. పాత మంత్రులంతా ఇవాళ రాజీనామా చేయనున్నారు. జగన్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే మంత్రులంతా రాజీనామాలను ముఖ్యమంత్రికి సమర్పించబోతున్నారు. ఇద్దరు, ముగ్గురు మినహా మంత్రులందరూ మారిపోతారంటూ వార్తలొస్తున్నాయి. ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తదితరుల్లో ఇద్దరు లేదా ముగ్గురు మళ్లీ మంత్రులుగా తిరిగి ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోందిచివరి సారిగా భేటీ కానున్న మంత్రివర్గ సమావేశంలో కాబోయే మాజీలకు భవిష్యత్ కార్యాచరణపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారని తెలుస్తోంది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలా ముందుకు వెళ్లాలో హితబోధ చేయనున్నారు. కొత్త వారితో ఈ నెల 11న ప్రమాణస్వీకారం చేయించనున్నారు.

సీనియర్ మంత్రులకూ ఉద్వాసన పలుకుతుండటంతో వారిలో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. దీన్ని వారు తీవ్ర అవమానంగా భావిస్తున్నారట. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ ను కొనసాగిస్తారని తేలడంతో అదే జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సలహాదారు సజ్జల బుజ్జగించినా ఆయన అలక వీడలేదట. ఉంటే ఇద్దరూ ఉండాలి లేదంటే ఇద్దరినీ తొలిగించాల్సిందేనని పట్టుపట్టినట్లు తెలుస్తోంది. దాంతో బాలినేనిని పిలిపించుకుని జగన్ మాట్లాడారని తెలుస్తోంది. సురేశ్ కొనసాగింపుపై జగన్ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి ..

  1. మునుగోడు టీఆర్ఎస్ లో పీకే సర్వే కలకలం.. సొంత పార్టీ నేతలపై కూసుకుంట్ల అసహనం
  2. డ్రగ్స్ హబ్ గా హైదరాబాద్? పోలీసుల కనుసన్నల్లోనే మత్తు మాఫియా?
  3. రాత్రి రాడిసన్ బ్లూ హోటల్‌ లో రేవ్ పార్టీలో సినీ ప్రముఖులు అరెస్ట్..
  4. గవర్నర్ కు యాదాద్రిలో ఘోర అవమానం.. యాక్షన్ తప్పదా?
  5. భారత్‌లోకి కొవిడ్ కొత్త వేరియంట్.. మళ్లీ కల్లోలమేనా?

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.