
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో పొత్తులపై కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ సాగుతోంది. జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో వైసీపీని ఓడించేందుకు బీజేపీ-జనసేన-టీడీపీ ఏకమవుతాయనే చర్చ సాగుతోంది. అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన పరిణామాలతో సీన్ మారిపోయిందని తెలుస్తోంది. బీజేపీతో టీడీపీ పొత్తు కుదరదని స్పష్టమవుతోంది. ఇది గ్రహించిన తెలుగుదేశం పార్టీ కూడా మరో ప్లాన్ ప్రకారం ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది.
Also Read : ఆసక్తికరంగా ‘బరి’ ట్రైలర్..మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
కొన్ని రోజులుగా ఢిల్లీలో కాంగ్రెస్ కూటమితో సఖ్యతగా ఉంటున్నారు టీడీపీ ఎంపీలు. ఇటీవల కాంగ్రెస్ పిలుపిచ్చిన పెట్రోల్ నిరసనలకు రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మద్దతు ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో టీడీపీ ఎంపీలు విందు భేటీకి హాజరయ్యారు. ఢిల్లీలో శనివారం తమిళనాడు అధికార పార్టీ డీఎంకే తన కార్యాలయాన్ని ప్రారంభించింది. దీనికి సోనియా గాంధీ తమిళనాడు సీఎం స్టాలిన్ సహా టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్ రామ్మోహన్ నాయుడు, రవీంద్రకుమార్ హాజరయ్యారు. చంద్రబాబు కు చెప్పకుండా టీడీపీ ఎంపీ రామ్మోహన్ ఏమీ చేయరు. దీంతో ఈ విందుకు చంద్రబాబు సూచనల మేరకే రామ్మోహన్ నాయుడు, జయదేవ్ వెళ్లారని అంటున్నారు.
Read More : ఉస్మానియా హాస్పిటల్ పై నుంచి దూకి రోగి సూసైడ్.. కారణం వింటే షాకే?
తాజా పరిణామాలతో కాంగ్రెస్ తో మళ్లీ టీడీపీ జత కడుతుందా అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ , సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కశ్మీర్, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, డీపీఐ నేత తొల్ తిరుమావళవన్ ఎండీఎంకే నేత వైగో తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. దీంతో డీఎంకే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం బీజేపీ వ్యతిరేక పక్షాల కలయికకు వేదికైందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా ఈ కూటమితో టీడీపీ జత కట్టడంపై రకరకాల ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు కాంగ్రెస్ తో జత కట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి జాతీయ స్థాయిలో యూపీఏ కూటమితో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా అనే చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి ..
- రాహుల్ సమావేశంలో టీఆర్ఎస్- కాంగ్రెస్ పొత్తుపై చర్చ!
- తెలంగాణ హెల్త్ డైరెక్టర్ క్షుద్రపూజలు! ఎమ్మెల్యే పదవి కోసమేనా..?
- టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు శ్రీరాం రాంచందర్‌కు ఘన సన్మానం
- చట్టం వాళ్లకు చుట్టమా! ఓల్డ్ సిటీలో పోలీసులు డమ్మీలేనా?