Andhra Pradesh

పవన్ పార్టీ బీజేపీలో విలీనం!

క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : తెలుగు కొత్త సంవత్సరాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. ఇళ్లలో ప్రత్యేక పూజలు చేస్తూ శుభకృత్​ నామ సంవత్సరానికి ఏడాదికి స్వాగతం పలుకుతున్నారు. ఉగాది సందర్భంగా ఆలయాల్లో పంచాంగ పఠనాలు జరుగుతున్నాయి. జనాలు కొత్త సంవత్సరంలో తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని తెలుసుకుంటున్నారు.

కొత్త పంచాంగం ప్రకారం శుభకృత్​ నామ సంవత్సరం మెగా ఫ్యామిలీకి ఎలా ఉండబోతుందో ప్రముఖ జోతిష్య నిపుణులు పాలెపు రాజేశ్వర శర్మ చెప్పారు. మెగా స్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో సీఎం అవుతారా? మెగా బ్రదర్ నాగబాబు పూర్తిగా రాజకీయాల్లోకి వస్తారా? అన్న విషయాలపై రాజేశ్వర శర్మ తన పంచాంగ పఠనంలో వివరించారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుల పొలిటికల్ కెరీర్‌లో చాలా హైప్ అనేది ఏమీ ఉండదని జోతిష్య నిపుణులు తెలిపారు.

చిరంజీవి రాజజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టినప్పుడు వద్దని కొందరు జాతకులు చెప్పారని… అయినా చిరు ఒకరి సలహాతో ముందుకు వెళ్లారని జోతిష్యుడు తెలిపారు . ఆ తర్వాత చిరంజీవి అనేక ఇబ్బందులు పడ్డారు…ఆ తర్వాత కేంద్రమంత్రి అయ్యారన్నారు. మళ్లీ రీ ఎంట్రీ అంటే.. అంతగా ఏమీ ఉండదని రాజేశ్వర శర్మ చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రభావం బాగా పెరుగుతుంది కానీ.. సీఎం అయ్యే చాన్స్ అయితే ఇప్పట్లో లేదన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీని సంపూర్ణంగా వదిలేసి.. బీజేపీలోకి మెర్జ్ అవుతారని జోతిష్య నిపుణులు పాలెపు రాజేశ్వర శర్మచెప్పారు.

ఇవి కూడా చదవండి ..

  1. ఎలుకలు కొరికిన శ్రీనివాస్ మృతి.. వరంగల్ ఎంజీఎంలో కలకలం
  2. పవిత్రమైన వృత్తిలో ఉంటూ పాడు పనిచేసిన డాక్టర్
  3. కేబినెట్ లోకి తమ్మినేని.. స్పీకర్ గా ధర్మాన?
  4. కరెంట్ ఛార్జీలపై కూకట్ పల్లిలో బీజేపీ ధర్నా
  5. కేసీఆర్ పై ఆర్జీవీ బయోపిక్.. రచ్చరచ్చేనా?

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.