Andhra Pradesh

కేబినెట్ లోకి తమ్మినేని.. స్పీకర్ గా ధర్మాన?

క్రైమ్ మిర్రర్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ పునర్ వ్యవస్థికరణకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరు తప్ప అందరిని మార్చివేస్తారనే ప్రచారం జరుగుతోంది. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి సీనియర్లకు ఉద్వాసన తప్పదంటున్నారు. జగన్ చేయబోయ కేబినెట్ మార్పులపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జిల్లాల వారీగా అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం జిల్లా నుంచి ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో బలమైన నాయకుడిగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. 2019 ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను ధర్మాన చేత విడుదల చేయించారు జగన్. తీరా గెలిచాక మాత్రం మంత్రిపదవి ఇవ్వకుండా ఆయన్ను పక్కన పెట్టారు. ఆయన సోదరుడు కృష్ణదాస్ ను కేబినెట్ లోకి తీసుకున్నారు. శ్రీకాకుళం ఎంపీ సీటు విషయంలో ప్రసాదరావు సహకరించలేదని, అందువల్లనే వైసీపీ ఓటమి పాలైందనే భావనలో జగన్ ఉన్నారట. అందుకే ధర్మానకు మంత్రిపదవి అవకాశం పోయిందంటున్నారు. తాజాగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుండటంతో ఈసారి ప్రసాదరావు మంత్రివర్గంలో చోటు దక్కవచ్చని అంటున్నాకు.

అయితే వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ధర్మాన ప్రసాదరావుకు మంత్రి పదవి కాకుండా స్పీకర్ పదవి మాత్రమే ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న క్రిష్ణ దాస్ తనకు పదవి పోతే తమ్ముడు ప్రసాదరావుకు ఇవ్వాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ విధంగా మినిస్టర్ గిరీ అయిదేళ్ళూ ఆ ఫ్యామిలీకే ఉంటుందని ఆలోచన చేస్తున్నారు. కానీ జగన్ చూపు మాత్రం తమ్మినేని సీతారామ్ మీద ఉందని అంటున్నారు. దానికి కారణం ఆయన అచ్చెన్నాయుడును టార్గెట్ చేయడమే అంటున్నారు. అచ్చెన్నాయుడు, తమ్మినేనికి రాజకీయంగా బద్ధ వైరం. దీంతో తమ్మినేనిని ముందు పెట్టి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ యుద్ధాన్ని కొనసాగించాలని జగన్ ఆలోచనగా ఉందంటున్నారు.

ఇవి కూడా చదవండి ..

  1. శ్రీశైలంలో కన్నడ భక్తుల వీరంగం.. అర్ధరాత్రి విధ్వంసం
  2. ఇద్దరు తప్ప అందరు అవుట్.. జగన్ కొత్త కేబినెట్ లో రోజా?
  3. కరెంట్ ఛార్జీలపై కూకట్ పల్లిలో బీజేపీ ధర్నా
  4. కేసీఆర్ పై ఆర్జీవీ బయోపిక్.. రచ్చరచ్చేనా?
  5. ఎల్బీనగర్ నుంచి బండి సంజయ్ పోటీ!

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.