Andhra Pradesh

ఏపీ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణమా.. మంత్రి పేర్నినాని చెప్పిన నిజం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ప్రతినెలా కొత్త అప్పులు తేస్తేనే కాని పాలన ముందుకు సాగని పరిస్థితి. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్న కొత్త రుణం తీసుకోవాల్సిందే. రుణం లభించకపోతే జీతాలు ఆలస్యమే. ప్రతి నెలా కొత్త రుణం కోసం కేంద్రాన్ని అభ్యర్థించడం పరిపాటిగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే కనుక ఇంతమందితో గొడవ ఎందుకు పెట్టుకుంటామని అన్నారు. ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉండటం వల్లే ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నామని మంత్రి చెప్పారు.

Read More : 216 అడుగులు విగ్రహం.. అత్య‌ద్భుత దివ్య‌క్షేత్రం! ముచ్చింతల్ లో మహా వేడుక..

ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా సచివాలయంలో పేర్నినాని రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐఆర్ 27 శాతం ఇచ్చి, ఫిట్‌మెంట్ 23 శాతానికి తగ్గించడం ఏంటని కొందరు మహిళా ఉద్యోగులు ఆయన ప్రశ్నించారు. ఎప్పటి నుంచో ఉన్న హెచ్ఆర్ఏను ఇప్పుడు తగ్గించడం ఏంటన్నారు. మంత్రి బదులిస్తూ.. పదో తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయితే స్కూటర్ కొని ఇస్తానని హామీ ఇచ్చిన తండ్రి.. ఆ సమయానికి దివాలా తీస్తే పరిస్థితి ఏంటని ఎదురు ప్రశ్నించారు. స్కూటర్ కొనిస్తానని కూడా ఇవ్వలేదని ఆ కొడుకు తిట్టుకుంటే అతడు ఏం చేయగలడని, ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి కూడా అలాగే ఉందని అన్నారు.

Read More : ప్రధాని అయినా డోంట్ కేర్… కేసీఆర్ తీరుపై రాజకీయ రచ్చ..!

రాష్ట్రంలో 1.57 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డు దారులు ఉన్నారని ఉప్పు, పప్పు కొంటూ ప్రభుత్వానికి జీఎస్టీ కడుతున్నారని, మరి అలాంటి వారి కోసం ప్రభుత్వం ఏమీ చేయవద్దా అని ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయమంతా ఉద్యోగుల జీతాలకు, తెచ్చిన అప్పులపై వడ్డీ కట్టేందుకే సరిపోతే మరి వారి సంక్షేమానికి ఏం చేయాలని ప్రశ్నించారు. దీనికి ఉద్యోగులు బదులిస్తూ పెద్ద మనసు చేసుకుని హెచ్ఆర్ఏ పెంచాలని కోరగా.. ఇది మనసుకు సంబంధించిన అంశం కాదని, గల్లా పెట్టెకు సంబంధించినదని మంత్రి పేర్ని నాని చెప్పారు.

ఇవి కూడా చదవండి..

  1. బిగ్ బాస్ 6 కంటెస్టెంట్స్ ఫైనల్… ఫిబ్రవరిలోనే షురూ..
  2. ఏపీ ఆర్థిక పరిస్థితి ఇంత దారుణమా.. మంత్రి పేర్నినాని చెప్పిన నిజం
  3. గానకోకిల లతా మంగేష్కర్ మృతి.. ప్రముఖుల సంతాపం
  4. ఒవైసీపై దాడి.. పీకే ప్లానేనా? కేసీఆర్ కు లింకుందా..?

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.