Andhra Pradesh

తణుకులో జగనన్న గృహహక్కు పథకం ప్రారంభం..

ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారంతా పేదల పాలిట శత్రువులే అన్న జగన్

క్రైమ్ మిర్రర్, అమరావతి: ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారంతా పేదల పాలిట శత్రువులు అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. పేదలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని యెద్దవా చేశారు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మేరకు లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. ఓటీఎస్ ద్వారా 52లక్షల మంది లబ్ధిదారులకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిన పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ డాక్యుమెంట్స్ ద్వారా ఎలాంటి లింక్ డాక్యుమెంట్స్ లేకుండా ప్రజలు తమ ఇళ్లను విక్రయించుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు.

టీఆర్ఎస్ తో పొత్తుకు సీనియర్ల స్కెచ్! కాంగ్రెస్ కు గుడ్ బై యోచనలో రేవంత్? – Crime Mirror

ప్రతి ఒక్కరికి రూ.5లక్షల నుంచి రూ.10లక్షల ఆస్తిని ఎలాంటి ఛార్జీలు లేకుండానే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామని ఆయన అన్నారు. రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లి గంటల తరబడి ఎదురుచూడకుండా గ్రామ సచివాలయాల ద్వారా కేవలం పది నిముషాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సీఎం వివరించారు. ప్రభుత్వం చేసే మంచి పనులను కొందరు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబుతో పాటు ఆయన అనుకూల మీడియా సంస్థలు ప్రజలకు మంచి చేస్తే జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వస్తే.. జగన్ ఉచిత ఇళ్లు ఇస్తే మీకెందుకు కడుపు మంట అని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎలాంటి డాక్యుమంట్లు లేకుండా మా ఇళ్లను మార్కెట్ రేట్లకు కొంటారా అని నిలదీయాలన్నారు.2014-19 మధ్య చంద్రబాబు హయాంలో ప్రభుత్వం కట్టించిన ఇళ్ల రుణాలపై వడ్డీ కూడా మాఫీ చేయలేదని సీఎం జగన్ విమర్శించారు.

కనీసం వడ్డీ మాఫీ చేయని వాళ్లు ఇప్పుడు విమర్శలుచేస్తున్నారన్నారు. 2014-19 మధ్యలో 43వేల మంది లబ్ధిదారులు 15కోట్ల 29లక్షలు చెల్లించిన వారికి యాజమాన్య హక్కులు కూడా ఇవ్వలేదన్నారు. డబ్బులు కట్టించుకొని కూడా యాజమాన్య హక్కులు ఇవ్వని ఘనత చంద్రబాబుదేనని జగన్ విమర్శించారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ద్వారా నామమాత్రపు ఛార్జీలతో పేదవాడికి మంచి చేస్తున్నామన్నారు. 30నెలల కాలంలోనే జగనన్న ప్రభుత్వం అక్షరాల లక్షా 16వేల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లోనే వేశామన్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి అధికారి, ప్రతి వాలంటీర్ ప్రజలకు వివరించాలని జగన్ పిలుపునిచ్చారు.

కేంద్రంపై చావు డప్పు సరే.. కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కదా? – Crime Mirror

ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారంతా పేదల పాలిట శత్రువులు అని మండిపడ్డారు. ఇదే సభలో ఇంగ్లీష్ మీడియం అంశాన్ని కూడా లేవనెత్తారు సీఎం జగన్. ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్నవారు వారి పిల్లలకు ఎందుకు ఇంగ్లిష్ చదువులు చెప్పిస్తున్నారని జగన్ ప్రశ్నించారు. పేదలకు 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారన్నారు. అమరావతి రాజధాని అని చెబుతున్న పెద్దమనుషులు.. పేదలకు ఇళ్ల పట్టాలిస్తే కోర్టులో పిటిషన్ వేసి అడ్డుకున్నారన్నారు. ఓటీఎస్ పథకాన్ని ఉగాది వరకు పొడిగిస్తున్నామని జగన్ ప్రకటించారు. స్వచ్ఛందంగానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని.. వీలైంత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో పొడిగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి ..

  1. ఇంటర్ విద్యార్థులంతా పాస్!
  2. ఒమిక్రాన్, డెల్టా కలిస్తే సూపర్ వేరియంట్‌! అదే జరిగితే పెను విలయమే?
  3. తెలంగాణలో 20 ఒమిక్రాన్ కేసులు.. జనవరిలో విలయమే?
  4. మందుబాబులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న లిక్కర్ ధరలు

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.