Andhra Pradesh

ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు! డిక్లేర్ చేసిన విశాఖ నేత..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీల మధ్య కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నాయి. 2019లో అన్ని పార్టీలు విడివిడిగా పోటీ చేసినా.. ప్రస్తుతం బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంది. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని మండలాల్లో తెలుగు దేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేశాయి. దీంతో గతంలో పని చేసిన అనుభవం ఉండటంతో రెండు పార్టీల కేడర్ త్వరగానే కలిసిపోయారు. ఏపీలో వైసీపీ పార్టీ బలంగా ఉండటంతో.. మళ్లీ పొత్తుల కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. బీజేపీ స్నేహం కోసం టీడీపీ చేయాల్సినవన్నీ చేస్తోంది. అయితే బీజేపీకి సంబంధించి ఏపీ బాధ్యులుగా ఉన్న సునీల్ డియోధర్ . ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం టీడీపీ పొత్తు ఉండదంటే ఉండదు అనేస్తున్నారు.

రాష్ట్ర బీజేపీ పెద్దలు టీడీపీతో కలిసిపోయే ప్రసక్తే లేదని చెబుతుండగా.. కొందరు నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విశాఖకు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు టీడీపీకి తన మద్దతు అంటున్నారు. విశాఖ కార్పొరేషన్ లో 31వ వార్డుకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీకే కమలం అండగా ఉంటుందని చెప్పేశారు. కనీసం టీడీపీ వారి నుంచి మద్దతు కోరుతూ ఏ రకమైనా వినతి రాకుండానే రాజు గారు డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది కూడా తానున్న పార్టీ పెద్దలు టీడీపీ విషయంలో తీసుకున్న స్టాండ్ కి విరుద్ధంగా ఆయన ఈ ప్రకటన చేయడమే చర్చనీయాంశం అవుతోంది.

నిజానికి విష్ణు కుమార్ రాజు గారికి చంద్రబాబు అంటే చాలా ఇష్టం. ఆయన అది ఎక్కడా ఎపుడూ దాచుకోలేదు. గత అసెంబ్లీలో ఆయన బీజేపీ తరఫున శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. ఆయన అప్పుడు నిండు సభలోనే చంద్రబాబుని చాలా సార్లు పొగిడారు. చందబాబు వయసులో ఉన్నపుడు శోభన్ బాబులా అందంగా ఉండేవారంటూ కీర్తించారు కూడా. అప్పట్లో టీడీపీకి బీజేపీకి చెడిన తరువాత అసెంబ్లీలో టీడీపీ కమలం పార్టీని చీల్చిచెండాడుతున్న టైమ్ లో కూడా ఇదే రాజు గారు పెద్దగా రియాక్ట్ కాలేదన్న కామెంట్స్ ఉన్నాయి. ఇక ఎన్నికల ముందు ఆయన టీడీపీలోకి వెళ్లాలని విపరీతంగా ట్రై చేశారన్న ప్రచారం కూడా అప్పట్లో వచ్చింది.

మొత్తానికి రాజు గారు ఇపుడు కూడా టీడీపీ మీద ఏ మాత్రం మోజు చంపుకోలేదని ఆయన తాజా స్టేట్మెంట్స్ నిరూపిస్తున్నాయని అంటున్నారు. మరి ఏపీలో టీడీపీ అవినీతి పార్టీ కుటుంబ పార్టీ అని ఒక వైపు సునీల్ డియోధర్ అంటున్నారు. ఆ పార్టీ తో తాము చేతులు కలిపే ప్రసక్తి లేదు అని ఆయన పక్కాగా చెప్పేస్తున్నారు. ఇపుడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న సీనియర్ నేత ఇలా టీడీపీ మీద ఇంత ప్రేమను చూపిస్తూంటే ఆయన ఏం చేస్తారు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అన్న చర్చ అయితే గట్టిగా ఉంది. అయితే బీజేపీలో రెండు వర్గాలు ఉన్నాయని చాలా కాలంగానే ప్రచారం ఉంది. టీడీపీ అనుకూల వర్గం వ్యతిరేక వర్గాలుగా పార్టీ ఉందని కూడా అంటారు. ఆ విధంగా చూసుకుంటే టీడీపీ అనుకూల వర్గంలో రాజు గారు ఉన్నారని అంటున్నారు.

ఇవి కూడా చదవండి…

  1. తెలంగాణలో మరో ఉప సమరం.. ఆ రెండు స్థానాలకు ఖాయమట!
  2. ఉద్యమ వీరులకా.. వలస నేతలకా? ఎమ్మెల్సీ సీట్లు దక్కేదెవరికో?
  3. కవితకు ఎమ్మెల్సీ లేనట్టేనా? కేటీఆర్ తో గొడవలే కారణమా?
  4. ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఖరారు…

WhatsApp Image 2021 06 19 at 4.16.03 PM - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.