Andhra Pradesh

పురపాలక ఎన్నికల ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పురపాలక ఎన్నికలు జరిగే చోట్ల ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార షెడ్యూలును తెలుగు తమ్ముళ్లు సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు సత్తాచాటిన విషయం తెలిసిందే. ఈ జోష్‌తో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలని టీడీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. త్వరలో తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నందున పురపాలక ఎన్నికలను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకునట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.