
క్రైమ్ మిర్రర్, ఎల్బీ నగర్ : తెలంగాణలో అధికారమే లక్ష్యంగా రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న విజయభేరి సభలో ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ సోదరసోదరీమణులకు నమస్కారాలు అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన సోనియా.. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలను కలుసుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు.
Also Read : తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ… నోటిఫై చేసిన ఈసీ, నోటిఫికేషన్ విడుదల
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెరవేర్చేలా 6 గ్యారెంటీలు ఇస్తున్నామని సోనియా గాంధీ తెలిపారు. ఒక్కో గ్యారెంటీని తమ పార్టీలోని ఒక్కో అగ్రనేత ప్రకటిస్తారని చెప్పారు. మొదటగా తాను మహాలక్ష్మి పథకాన్ని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా మహిళలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని వెల్లడించారు. మరోవైపు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని వివరించారు.
Also Read : అవసరం కోసం చేసిన అప్పు… ప్రాణం తీసింది…
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షను నెరవేర్చిన సోనియా గాంధీ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు జాతీయ నాయకత్వం పాల్గొనబోయే విజయభేరి సభకు మహేశ్వరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివెళుతున్న వాహనాలకు జెండా ఊపి ప్రారంభించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి, విజయభేరి సభ కోఆర్డినటర్ నల్ల సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- ప్రియుడి మోజులో భర్తను హత్య చేయించిన మరో మహిళ
- టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో 3.5 కోట్ల ఆస్తుల సీజ్
- నగదు బదిలీ విషయంలో ఏపీ ప్రభుత్వం యూటర్న్
- ఆ ఇద్దరే హంతకులు… ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య