
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావానికి సిద్ధమైంది. తీన్మార్ మల్లన్న స్థాపించబోయే కొత్త పార్టీని ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ పేరుతో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ ఈసీ వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన జారీ చేశారు. ఈ నెలాఖరు లోపు అభ్యంతరాలు, ఫిర్యాదు స్వీకరిస్తామని తెలిపింది. తెలంగాణ నిర్మాణ పార్టీ అధ్యక్షుడుగా తీన్మార్ మల్లన్న, ప్రధాన కార్యదర్శిగా మాదం రజనీ కుమార్ (హన్మకొండ జిల్లా ధర్మసాగర్), కోశాధికారిగా ఆర్ భావన (చంపాపేట్, సరూర్‌నగర్, హైదరాబాద్) ఉన్నట్లుగా పేర్కొన్నారు. కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో తీన్మార్ మల్లన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పార్టీ పేరును కూడా అప్పుడే ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న మేడ్చల్ నియోజకవర్గంలో పోటీ చేస్తారని ప్రచారం ఉంది.
Also Read : హోంగార్డు రవీందర్ కన్నుమూత.. జీతాలు పడక నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం
అంతేకాదు తెలంగాణ నిర్మాణ పార్టీ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలినా తమకేం సంబంధం లేదని.. తాము కేసీఆర్‌కు వ్యతిరేకమని.. ప్రతిపక్ష పార్టీలకు కాదన్నారు. తమతో కలిసి పని చేసేందుకు ఏ ప్రతిపక్ష పార్టీ ముందుకు వచ్చినా స్వాగతిస్తామన్నారు మల్లన్న. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్ కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం సొంత గ్రామం. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశారు. హైదరాబాద్ జెఎన్టీయూ నుంచి 2009లో ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఆ తర్వాత పలు న్యూస్ ఛానెల్స్‌లలో పని చేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తీన్మార్ వార్తలు ద్వారా నవీన్ తీన్మార్ మల్లన్నగా ఫేమస్ అయ్యారు.
Read Also : ఎమ్మెల్యే కుమార్తె కులాంతర ప్రేమ.. దగ్గరుండి ఆలయంలో పెళ్లి చేసిన ఎమ్మెల్యే
తీన్మార్ మల్లన్న 2015లో నల్గొండ -ఖమ్మం –వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం స్థానానికి జరిగిన ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2021 మార్చిలో నల్గొండ –ఖమ్మం–వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఆయన ప్రస్తుతం క్యూ గ్రూప్ మీడియాను నిర్వహిస్తున్నారు.. ఆయన బీజేపీలో కూడా కొంతకాలం పనిచేశారు. ఇప్పుడు సొంతంగా పార్టీని ప్రారంభించారు. మల్లన్న ఇప్పటికే ఆయన అన్ని జిల్లాల్లో పర్యటించారు.. పార్టీ ఆవిర్భావంతో రాబోయే రోజుల్లో మరింతగా జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఎన్నికల సంఘం దగ్గర ప్రక్రియ మొత్తం పూర్తయితే తెలంగాణ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- అన్న భార్యను లవ్ చేసిన తమ్ముడు.. పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్.. సీన్ కట్ చేస్తే..
- టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్ ఎత్తివేత..
- బాహుబలి సీన్ రిపీట్.. చిన్నారి వైద్యం కోసం ప్రాణాలకు తెగించి సాహసం
- నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.. నేడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్.. పేరు మార్పుకు బలం
- తెలంగాణలో ఎన్నికల హడావుడి.. సిరిసిల్ల నేతన్నకు చేతినిండా పని, లక్షల్లో ఆర్డర్లు
3 Comments