
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 5089 పోస్టుల భర్తీకి వీలుగా ఈ నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి సంబంధించిన పోస్టులు..పరీక్ష వివరాలను షెడ్యూల్ లో వెల్లడించారు. పరీక్ష నిర్వహించే కేంద్రాలను ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో 5089 స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీచేసింది.
Read Also : WWE పోటీలకు ముస్తాబైన హైదరాబాద్.. బరిలో వరల్డ్ రెజ్లింగ్ స్టార్స్!
ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 5089 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో స్కూల్ అసిస్టెంట్ 1739, లాంగ్వేజ్ పండిట్ 611, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 164, సెకండరీ గ్రేడ్ టీచర్ 2575 చొప్పున పోస్టులు ఉన్నాయి. టీఆర్టీ దరఖాస్తుకు బీఈడీ, డీఈడీ, బీపీఈడీలో ఉత్తీర్ణులైన వారు అర్హులుగా పేర్కొంది. 18-44 లోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తిగా ఆన్ లైన్ విధానంలోనే దరఖాస్తు విధానం ఉండనుంది. పరీక్షా విధానం కంప్యూటర్ బేస్డ్ పద్దతిలో నిర్వహించనున్నారు.
Also Read : తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ… నోటిఫై చేసిన ఈసీ, నోటిఫికేషన్ విడుదల
ఇందుకు అప్లికేషన్ ఫీజు రూ.1000 గా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుల స్వీకరణకు అక్టోబర్ 21 చివరి తేదీగా నిర్ణయించారు. నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్ లైన్ లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వం జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను వెల్లడించింది. అందులో అత్యధికంగా హైదరాబాదులో 358 ఖాళీలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో 275, కొమరం భీమ్ అసిఫాబాద్లో 289, సంగారెడ్డిలో 283, రంగారెడ్డిలో 196, సూర్యాపేటలో 185,వికారాబాద్ లో 191, నల్గొండలో 219, కామారెడ్డిలో 200, అదిలాబాదులో 275, నిజామాబాద్ లో 309, నారాయణపేటలో 154, మెదక్ లో 147, ఖమ్మంలో 195, కామారెడ్డిలో 200 పోస్టులు ఖాళీలుగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://schooledu.telangana.gov.in ను సంప్రదించాలని ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి :
- హోంగార్డు రవీందర్ కన్నుమూత.. జీతాలు పడక నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం
- ఎమ్మెల్యే కుమార్తె కులాంతర ప్రేమ.. దగ్గరుండి ఆలయంలో పెళ్లి చేసిన ఎమ్మెల్యే
- అన్న భార్యను లవ్ చేసిన తమ్ముడు.. పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్.. సీన్ కట్ చేస్తే..
- టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్ ఎత్తివేత..
- బాహుబలి సీన్ రిపీట్.. చిన్నారి వైద్యం కోసం ప్రాణాలకు తెగించి సాహసం
One Comment