
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : హైదరాబాద్‌లో ఆత్మహత్యకు యత్నించిన హోంగార్డు రవీందర్ కన్నుమూశాడు. కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 70% కాలిన గాయాలతో ఉన్న రవీందర్‌కు వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందించారు. అయితే గురువారం ఆయన పరిస్థితి మరింత విషమంగా మారగా.. ఇవాళ ప్రాణాలు కోల్పోయాడు. రవీందర్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు డీఆర్డీవో వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Also : ఎమ్మెల్యే కుమార్తె కులాంతర ప్రేమ.. దగ్గరుండి ఆలయంలో పెళ్లి చేసిన ఎమ్మెల్యే
సకాలంలో జీతం అందక బ్యాంకు ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైందన్న మనస్తాపంతో అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకొని రవీందర్ నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన షాయినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన రవీందర్‌ను వెంటనే ఉస్మానియాకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం అతడు మృతిచెందాడు. ఉప్పుగూడకు చెందిన రవీందర్ చాంద్రాయణగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్నాడు. అతనికి భార్య సంధ్య, పిల్లలు మనీశ్, కౌశిక్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
- అన్న భార్యను లవ్ చేసిన తమ్ముడు.. పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్.. సీన్ కట్ చేస్తే..
- టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్ ఎత్తివేత..
- బాహుబలి సీన్ రిపీట్.. చిన్నారి వైద్యం కోసం ప్రాణాలకు తెగించి సాహసం
- నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.. నేడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్.. పేరు మార్పుకు బలం
- ఎమ్మెల్సీ కవితకు వైఎస్ షర్మిల లేఖ.. మార్పు మీ నుంచే మొదలు పెట్టాలంటూ సూచన
One Comment