
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రస్తుత సమాజంలో మానవసంబంధాలకు విలువ లేకుండా పోతుంది. కామవాంఛతో వావివరసలు మరిచి నీచానికి దిగజారుతున్నారు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ కొందరు కాపురాలను నాశనం చేసుకుంటుండగా.. మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ బోయిన్‌పల్లిలో అటువంటే ఘటనే చోటు చేసుకుంది. అన్న భార్యను లవ్ చేసిన ఓ వ్యక్తి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేగా.. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
Also Read : టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్ ఎత్తివేత..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన ప్రదీప్ కుమార్ (23) తన స్నేహితులతో కలిసి ఓల్డ్ బోయిన్‌పల్లి జీఎస్‌టి కాంప్లెక్స్‌లో నివాసం ఉంటూ అక్కడే ఓ ట్రాన్స్‌పోర్టు సంబంధిత పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రదీప్ కుమార్ అన్నయ్య (పెదమ్మ కుమారుడు) శివ కుమార్ కూడా ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి భార్యతో కలిసి బోయిన్ పల్లిలోనే నివాసం ఉంటున్నాడు. దీంతో అప్పుడప్పుడు అన్నయ్య వద్దకు ప్రదీప్ వెళ్లేవాడు. ఈ క్రమంలో అన్న భార్యకు, ప్రదీప్ కుమార్‌కు మధ్య ముందు స్నేహం ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో తన అన్నయ్య శివకుమార్ వదలేసి తనను వివాహం చేసుకోవాలని గత కొంతకాలంగా ప్రదీప్ కుమార్ వదినపై ఒత్తిడి తెస్తున్నాడు.
Read Also : బాహుబలి సీన్ రిపీట్.. చిన్నారి వైద్యం కోసం ప్రాణాలకు తెగించి సాహసం
అందుకు ఆమె అంగీకరిం కరించలేదు. కాగా బుధవారం (సెప్టెంబర్ 6) ప్రదీప్ కుమార్ మరోసారి వదినకు ఫోన్ చేసి తనను పెళ్లి చేసుకోవాలని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో పాటు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. మనస్థాపం చెందిన ప్రదీప్ కుమార్ తాను ఇక బ్రతకనని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్ పెట్టేశాడు. ఆందోళనకు గురైన ఆమె.. వెంటనే విషయాన్ని భర్త శివ కుమార్‌కు తెలియజేసింది. అప్రమత్తమైన శివ కుమార్ విషయాన్ని ప్రదీప్ కుమార్ స్నేహితులకు చెప్పగా.. వారు రూమ్‌కు వెళ్లి చూశారు. తలుపులు బిగించి ఉండటంతో బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే ఫ్యానుకు ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి :
- నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.. నేడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్.. పేరు మార్పుకు బలం
- ఎమ్మెల్సీ కవితకు వైఎస్ షర్మిల లేఖ.. మార్పు మీ నుంచే మొదలు పెట్టాలంటూ సూచన
- అలకబూనిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రంగంలోకి ఏఐసీసీ
- తెలంగాణలో ఎన్నికల హడావుడి.. సిరిసిల్ల నేతన్నకు చేతినిండా పని, లక్షల్లో ఆర్డర్లు
- నల్గొండలో విషాదం.. చికిత్స పొందుతూ ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతి
One Comment