
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆదర్శవంతంగా నిలిచింది. తన కుమార్తె వివాహాన్ని ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి దగ్గరుండి జరిపించారు. కే లీలా గోపీ పవన్ కుమార్‌తో తన మొదటి కుమార్తె రాచమల్లు పల్లవి పెళ్లి చేశారు. అంతకముందు నిరాడంబరంగా , సాంప్రదాయ బద్దంగా బొల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పెద్దల మధ్య వివాహం జరిగింది.
Read Also : అన్న భార్యను లవ్ చేసిన తమ్ముడు.. పెళ్లి చేసుకోవాలని ప్రపోజల్.. సీన్ కట్ చేస్తే..
అనంతరం ప్రొద్దుటూరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేయించారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. తాను నిరాడంబరంగా తన మొదటి కుమార్తె పల్లవి ప్రేమ, కులాంతర వివాహానికి ఒప్పుకుని ఆశీర్వదించాను అన్నారు. తన కుమార్తె ఇష్ట ప్రకారం దగ్గరుండి వివాహం చేశానని.. పేదవాడైన పవన్‌ను కలిసి చదువుకున్న రోజుల్లో పల్లవి ఇష్టపడటంతో పెళ్లి చేసినట్లు చెప్పారు. డబ్బుకు, హోదాకు, కులానికి విలువ ఇవ్వకుండా వారి ఇష్ట ప్రకారమే పెళ్లి చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- టెన్త్ హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో విద్యార్థిపై డీబార్ ఎత్తివేత..
- బాహుబలి సీన్ రిపీట్.. చిన్నారి వైద్యం కోసం ప్రాణాలకు తెగించి సాహసం
- నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.. నేడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్.. పేరు మార్పుకు బలం
- ఎమ్మెల్సీ కవితకు వైఎస్ షర్మిల లేఖ.. మార్పు మీ నుంచే మొదలు పెట్టాలంటూ సూచన
- అలకబూనిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రంగంలోకి ఏఐసీసీ
One Comment