
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బాహుబలి సినిమా గుర్తుందిగా..! మూవీ ఫస్ట్ పార్ట్‌లో ప్రారంభంలోనే పసిబిడ్డగా ఉన్న బాహుబలిని శివగామి (రమ్యకృష్ణ).. ప్రాణాలకు తెగించి కాపాడుకుంటుంది. ఓ చోట వాగు దాటుతుండగా.. వరద ఎక్కువైతే చిన్నారి కొట్టుకుపోకుండా తాను మాత్రం నీటిలో మునిగిపోయి ఒంటిచేత్తో పిల్లాడిని పైకిత్తి పట్టుకుని కాపాడుతుంది. ఈ సీన్.. ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. అయితే ఆ సీన్ సినిమాలోనే కాదు.. నిజ జీవితంలోనూ జరిగింది. ఎక్కడో కాదు మన తెలంగాణలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రిపీటయ్యింది. కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.
Read Also : నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ భారత్.. నేడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్.. పేరు మార్పుకు బలం
కెరమెరి మండలం లక్కాపూర్‌లో ఏడాది లోపు వయసున్న ఓ చిన్నారి అనారోగ్యం పాలయ్యాడు. గత మాడ్రోజులగా చిన్నారికి జ్వరం వస్తోంది. ఇంట్లో మాత్రలు వేసినా.. ఎంతకు జ్వరం తగ్గట్లేదు. అప్పటికే.. బయట భారీ వర్షాల కారణంగా వాగులు పొంగుతున్నాయి. వైద్యం చేయించాలంటే.. పక్కనే ఉన్న కెరమెరికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాలంటే తమ గ్రామం గుండా పోతున్న వాగు దాటాల్సిందే. భారీ వర్షాలతో వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. ఆ వాగుపై వంతెనలు కూడా లేవు. దీంతో చిన్నారి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బహుబలిని మించిన సాహసం చేశారు. బాహుబలి మూవీలో చూపించినట్లు చిన్నారిని చేతులతో పైకి ఎత్తి పట్టుకొని వాగు దాటించారు. కెరమెరికి తీసుకెళ్లి పిల్లాడికి వైద్యం చేయించారు. వంతెన లేని కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవహించిన ప్రతిసారీ తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.
Also Read : ఎమ్మెల్సీ కవితకు వైఎస్ షర్మిల లేఖ.. మార్పు మీ నుంచే మొదలు పెట్టాలంటూ సూచన
తినడానికి కావాల్సిన నిత్యావసర సరుకులు, వైద్యం కోసం ప్రమాదపు అంచుల్లో వాగు దాటుతున్నామని చెబుతున్నారు. గ్రామంలో ఎవరికైనా జ్వరాలు వస్తే వాగులు దాటలేని పరిస్థితిలో ఇంటి వద్దనే పారసిటమాల్ టాబ్లెట్ వేసుకొని ప్రాణాలు బ్రతికించుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి వంతనె ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అయితే నెల రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన ఓ చిన్నారి అనారోగ్యం పాలవగా.. అప్పుడు కూడా ఇలాగే చిన్నారిని వాగు దాటించారు. అందుకు సంబంధించిన దృష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా ప్రభుత్వం నుంచి వంతెన నిర్మాణం గురించి ఎలాంటి హామీ రాలేదు. ఇప్పటికైనా వంతన నిర్మాణానికి చొరవ చూపాలని గ్రామస్థులు వేడుకొంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- అలకబూనిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రంగంలోకి ఏఐసీసీ
- తెలంగాణలో ఎన్నికల హడావుడి.. సిరిసిల్ల నేతన్నకు చేతినిండా పని, లక్షల్లో ఆర్డర్లు
- నల్గొండలో విషాదం.. చికిత్స పొందుతూ ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతి
- భవన నిర్మాణ కార్మికులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా 50 రకాల వైద్య పరీక్షలు
- ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. అప్రమత్తమైన పోలీసులు