
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఎన్నికల వాతావరణం మెుదలైంది. అక్టోబర్‌లో నోటిఫికేషన్, డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయన్న సమాచారంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తమయ్యాయి. ఇక పార్టీల తరపున అభ్యర్థులు కూడా అప్పుడే ప్రచారం మెుదలుపెట్టారు. రాష్ట్రంలో ఎన్నికలు వస్తే కొందరికి ఉపాధి లభిస్తుంది. ప్రచారానికి వచ్చే వారికి టిఫిన్లు, భోజనాలతో హోటళ్లకు, ప్రచారానికి వాడే వెహికల్స్‌తో ప్రైవేటు వాహనాదారులకు ఇలా వారికి ఉపాధి లభిస్తుంది. వీరే కాకుండా సిరిసిల్ల నేతన్నలు కూడా ఎలక్షన్ల పుణ్యామా అని ఓ నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు.
Also Read : నల్గొండలో విషాదం.. చికిత్స పొందుతూ ఇద్దరు డిగ్రీ విద్యార్థులు మృతి
జెండాలు, కండువాల తయారీకి వివిధ పొలిటికల్ పార్టీల నుంచి ఆర్డర్లు వస్తుండటంతో సిరిసిల్ల నేత కార్మికులకు చేతినిండా పని దొరుకుతుంది. వివిధ పార్టీల, నాయకుల గుర్తులు, ఫొటోలతో పూర్తి స్థాయి జెండాలు, కండువాలను సిరిసిల్లలో నేతన్నలు తయారు చేసి వారికి అందిస్తుంటారు. జెండాలు తయారు చేసే నేతన్నలు రూ.9 చొప్పున మీటరు వస్త్రాన్ని కొనుగోలు చేస్తారు. దీనికి ప్రింటింగ్ కోసం రూ.8 ఖర్చవుతుంది. ఒక జెండా తయారీకి రూ.17 ఖర్చవుతుంది. ఉత్పత్తిదారులు ఈ జెండాలను రూ.18 నుంచి రూ. 20కి విక్రయిస్తున్నారు. జెండా కట్ చేస్తే ఒక్కో జెండాకు 25 పైసలు, స్టిచింగ్ చేస్తే 40 పైసలు చొప్పున కూలీలకు ఇస్తారు. జెండాల తయారీ కార్ఖానాలో జెండాలను కట్ చేస్తూ రోజుకు రూ.500 నుంచి రూ.700 వరకు కూలీలు సంపాదిస్తున్నారు.
Read Also : భవన నిర్మాణ కార్మికులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా 50 రకాల వైద్య పరీక్షలు
జెండాలను స్టిచింగ్ చేసే కార్మికులు రోజుకు రూ.1000 చొప్పున సంపాదిస్తున్నారు. జెండాల తయారీతో సిరిసిల్లలో దాదాపు 500 మంది నేత కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతానికి రెండు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నుంచి పది లక్షల ఆర్డర్లు అందాయని ఓ జెండాల తయారీదారు చెప్పారు. బీఆర్ఎస్ 5 లక్షలు , వైసీపీ 5 లక్షల ఆర్డర్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇంకా ప్రధాన పార్టీల ఆర్డర్లు అందలేదని.. కాంగ్రెస్, బీజేపీ, తదితర పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించిన వెంటనే ఆర్డర్లు వస్తాయని తయారీదారులు చెబుతున్నారు. ఆ ఆర్డర్లు కూడా వస్తే తమ ఆదాయం రెట్టింపు అవుతుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- మూడ్రోజుల క్రితం గల్లంతైన లక్ష్మి.. మూసీలో కొట్టుకొచ్చిన మృతదేహం
- ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్-ఉన్-నబీ.. అప్రమత్తమైన పోలీసులు
- హైదరాబాద్‌లో మరో దారుణం.. నాలాలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
- హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ నివాసం.. ఇక్కడి నుంచే జాతీయ రాజకీయాలు??
- తగ్గిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు… ఆయన పేరు మీదో ఓ పాత మారుతీ కారు
2 Comments