
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అనకాపల్లి జిల్లాలో ఓ గేదెకు వింత దూడకు జన్మించింది. చూసేందుకు అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఆ దూడ జన్మించింది. దీంతో అది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వింత దూడను చూసేందుకు స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రైతు ఇంటికి పోటెత్తారు. గొలుగొండ మండలం ఏ.ఎల్ పురం గ్రామంలో వబ్బల రెడ్డి పోతురాజు అనే రైతు ఇంట్లో ఈ వింత దూడ జన్మించింది. గేదెకి ప్రసవ సమయం మించినప్పటికీ ప్రసవించలేక తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆందోళనకు గురైన రైతు వెంటనే పశువైద్యురాలు శిరీషకు సమాచారం అందించారు.
Read Also : హైదరాబాద్‌లో కుండపోత.. రహదారులపై భారీగా వరద నీరు, పోలీసుల పలు సూచనలు
ఆమెకు అక్కడకు చేరుకొని దూడను బయటకు తీసింది. పుట్టిన దూడ తల మనిషిని పోలి ఉండడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఆ దూడ మృతి చెందింది. తల్లి గేదె క్షేమంగా ఉంది. జన్యుపరమైన లోపాల వల్లే ఇలాంటి దూడలు జన్మిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వింత దూడను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలు భారీగా తరలివచ్చారు. ఆ దూడ తల మనిషిని పోలి ఉండటంతో అంతా ఆశ్చర్యపోయారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతుందా? అని చర్చించుకుంటున్నారు.
Also Read : ఉదయనిధి తల నరికి తెస్తే రూ.10 కోట్లు ఇస్తా.. అయోధ్య స్వామీజీ సంచలన ప్రకటన
ఇక వారం రోజుల క్రితం.. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ వింత లేగదూడ జన్మించింది. దామరగిద్ద మండల పరిధిలోని అన్నసాగర్ గ్రామంలో రైతు చంద్రయ్య గౌడ్ ఆవు లేగదూడకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన దూడకు మూతి పైభాగము, ముక్కు లేదు. దీంతో రైతు వెంటనే వెటర్నరీ డాక్టర్‌ను సంప్రదించాడు. లేగ దూడ మూతి పైభాగం కట్ చేస్తే.. దూడ బతికే అవకాశం లేదని వైద్యుడు వెల్లడించాడు. అయితే వింతగా జన్మించిన దూడను చూసేందుకు స్థానికులతో పాటు సమీప గ్రామాల ప్రజలు చంద్రయ్య ఇంటికి బారులు తీరారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ నివాసం.. ఇక్కడి నుంచే జాతీయ రాజకీయాలు??
- మొల్కపట్నం గ్రామంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం..
- తగ్గిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తులు… ఆయన పేరు మీదో ఓ పాత మారుతీ కారు
- శ్మశానంలో నిండు గర్భిణి… కుళ్లిన ఆహారమే ఆమె భోజనం
- నిర్మల్‌లో అరుదైన వివాహం.. ఆస్ట్రేలియా అమ్మాయిని పెళ్లాడిన తెలంగాణ కుర్రాడు
2 Comments