
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : విశాఖ సమీపంలోని సింహాచలం కొండపై కొలువైన సింహాచలం అప్పన్నస్వామి ఉత్తరాంద్ర వాసులకు ఆరాధ్య దైవం. వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అలా వచ్చిన ఓ భక్తుడు చేసిన పని.. ఆలయ అధికారులకు షాక్ ఇచ్చింది. సింహాద్రి అప్పన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు స్వామి వారి హుండీలో ఓ చెక్ వేశాడు.
Read Also : సిద్దిపేట జిల్లాలో దారుణం.. గొంతు, కాళ్లు కట్ చేసి మహిళ హత్య
బొడ్డేపల్లి రాధాకృష్ణ అనే పేరుతో వేసిన ఆ చెక్ మీద వందకోట్లు రాసి ఉంది. లెక్కింపు సమయంలో చెక్ చూసి మొదట షాక్ అయిన సిబ్బంది.. ఆ తర్వాత ఆలయ చరిత్రలోనే అత్యధిక మొత్తం స్వామివారికి కానుక రూపంలో వచ్చిందని సంబరపడ్డారు. అనంతరం చెక్ చెల్లుతుందా లేదా అనే అనుమానంతో పరిశీలన కోసం కోసం ఆలయ ఈవోకు చూపించారు.. చెక్‌ను బ్యాంకుకు పంపించి ఆరా తీశారు ఈవో. అయితే అసలు విషయం తెలిసీ షాక్ తిన్నారు.
Also Read : బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత.. చేప మందు పంపిణీకి బత్తిని ప్రసిద్ధి
సదరు భక్తుడి ఖాతాలో కేవలం 17 రూపాయలే ఉన్నాయంటూ బ్యాంక్ అధికారులు చెప్పడంతో సింహాచలం ఆలయ అధికారులు కంగుతున్నారు. మరోవైపు భక్తుడు రాధాకృష్ణ అడ్రస్ వివరాలు కోరుతూ బ్యాంకుకు లేఖ రాయాలని దేవస్థానం వర్గాల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. దురుద్దేశ పూర్వకంగా చెక్ వేసినట్టు గుర్తిస్తే.. చెక్ బౌన్స్ కేసు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి వంద కోట్లు వచ్చిందని సంబరపడేలోగా.. అసలు విషయం తెలిసీ కంగుతిన్నారు ఆలయ అధికారులు.
ఇవి కూడా చదవండి :
- మోకిల ప్లాట్లకు సూపర్ రెస్పాన్స్.. సర్కారుకు తొలిరోజు రూ.122.42 కోట్ల ఆదాయం
- విజయహో విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపై దిగిన చంద్రయాన్ 3
- రాజయ్య పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది… సర్పంచ్ నవ్య
- పొలిటికల్ వ్యూహంలో భాగంగానే కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ..ఎమ్మెల్సీ కవిత కీలక కామెంట్స్
- తామేమీ కేసీఆర్ చేతిలో మోసపోలేదు.. ప్రతిపక్షాల కామెంట్లపై కూనంనేని కౌంటర్
4 Comments