
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సంబంధించిన పాత లేఖ ఒకటి మీడియా, సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ లేఖను 40 ఏళ్ల క్రితం.. ఒబామా తన ప్రియురాలికి రాసింది. దీంతోపాటు అందులో ఉన్న విషయం కూడా అంత చర్చకు దారితీస్తోంది. తాజాగా ఈ లేఖను న్యూయార్క్ పోస్ట్ బయటపెట్టింది. 1982 లో బరాక్ ఒబామా తన మాజీ ప్రేమికురాలికి ఒక లేఖ రాశారు. అయితే బరాక్ ఒబామాకు గే సెక్స్ అంటే ఇష్టమని ఆ లేఖ సారాంశం. తనకు రోజూ మగవాళ్లను దగ్గరికి తీసుకోవడమంటే ఇష్టమని.. అయితే అది తన కల మాత్రమేనని ఒబామా తాను రాసిన లేఖలోపేర్కొనడం గమనార్హం. న్యూయార్క్ పోస్ట్ బయటపెట్టిన లేఖ ప్రకారం.. ఒబామాకు కలలు వచ్చేవని తెలుస్తోంది.
Read Also : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై నిజమైన కేటీఆర్ అంచనా…
ఆ సమయంలో తనకు పురుషులతో రోజూ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు కలలు వచ్చేవని ఆ ఉత్తరంలో తెలిపారు. అయితే 1982 లో ఆ ఉత్తరం రాసే సమయానికి ఒబామా 21 ఏళ్ల వయసులో ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం పేర్కొంది. 1982 నవంబరులో ఆయన తన మాజీ లవర్ అలెక్స్ మెక్‌నియర్‌కు ఈ లెటర్ రాసినట్లు ఆ లెటర్‌పై రాసి ఉన్న తేదీ చూస్తే తెలుస్తోంది. 1982 లో లాస్‌ఏంజిల్స్‌లోని యాక్సిడెంటల్ కాలేజీలో బరాక్ ఒబామా, అలెక్స్ మెక్‌నియర్ కలిసి చదువుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ ప్రేమలో ఉండగా.. ఉత్తరాలు రాసుకున్నట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. తన ప్రేయసి అలెక్స్ మెక్‌నియర్‌కు రాసిన లెటర్‌లో బరాక్ ఒబామా.. హోమో సెక్సువాలిటీ గురించి రాసుకొచ్చారు.
Also Read : ఇచ్చేది చారెడు…దరఖాస్తులు బారేడు.. గృహలక్ష్మి దరఖాస్తులు నాలుగు రేట్లు అధికం…!!
అయితే దాదాపు 41 ఏళ్ల క్రితం రాసిన లెటర్.. తాను రాసినదేనని ఒబామా అంగీకరించారు. తాను ఒక పురుషుని రూపంలోనే మరో పురుషునితో ఉండేందుకు ఇష్టపడ్డానని ఒబామా చెప్పడం గమనార్హం. అయితే 1982 లో ఒబామాతో ప్రేమలో ఉన్న అలెక్స్ మెక్‌నియర్.. తమ ప్రేమాయణం పూర్తయిన తర్వాత ఆ లేఖలోని కొన్ని వివరాలను బయటకి వెల్లడించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అలెక్స్ మెక్‌నియర్‌కు ఒబామా రాసిన ఈ లేఖ ప్రస్తుతం ఎమోరీ యూనివర్శిటీలో ఉందని న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది. అయితే అలెక్స్ మెక్‌నియర్‌తో బ్రేకప్ తర్వాత 1992లో మిషెల్‌ను బరాక్ ఒబామా పెళ్లి చేసుకున్నారు. అయితే వారికి ఇద్దరు సంతానం. అమెరికాకు 2009 నుంచి 2017 వరకు డెమోక్రటిక్ పార్టీ తరఫున బరాక్ ఒబామా అధ్యక్షుడిగా పనిచేశారు. బరాక్ ఒబామా మొదటి ఆఫ్రికన్ అమెరికన్ అధ్యక్షుడు కావడం విశేషం.
ఇవి కూడా చదవండి :
- భారత్ కంటే ముందు పాకిస్థాన్ ఇండిపెండెంట్స్ డే ఎందుకు..??
- జింక మాంసం విక్రయిస్తున్న ముఠా అరెస్టు..
- బీటెక్ చదివిన వ్యక్తికి గురుకుల ప్రిన్సిపాల్‌గా పోస్టింగ్.. మంత్రి అన్న కొడుక్కి స్పెషల్ రిక్రూట్‌మెంట్?
- రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై డాయిష్ బ్యాంక్ రిపోర్ట్.. మూడో స్థానానికి ఎగబాకిన తెలంగాణ
- ఇంటికెళ్లిన యువతిని కిడ్నాప్ చేసి రేప్… 14 ఏళ్ల పాటు నరకయాతన
3 Comments