
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : యువతికి మాయమాటలు చెప్పి ఇంటికి రప్పించిన కామాంధుడు.. ఆమెను 14 ఏళ్లపాటు బంధించి వందలసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను సెక్స్ బానిసగా చేసి.. చిత్రహింసలకు గురిచేశాడు. అత్యంత దారుణమైన ఈ సంఘటన రష్యాలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలిపై1000 సార్లకు పైగా అత్యాచారానికి పాల్పడి.. పైశాచికత్వం ప్రదర్శిస్తూ, నరకం చూపించాడు. అంతేకాదు, మరో మహిళను తీసుకొచ్చి, అతి కిరాతకంగా ఆమె చూస్తుండగానే హత్య చేశాడు. చివరికి ఆ రాక్షసుడి చెర నుంచి బాధితురాలు తప్పించుకుని పోలీసుల్ని ఆశ్రయించింది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. పశ్చిమ రష్యాలోని చెల్యాబిన్స్క్ ప్రావిన్సుల్లో మిలినో గ్రామానికి చెందిన వ్లాదిమిర్ చెస్కిడోవ్ (51) అనే వ్యక్తి.. 2009లో ఎకతరీనా అనే యువతిని మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు.
Read Also : వీల్ చైర్‌పై ఉత్తరాఖండ్ నుంచి తిరుమలకు.. దేశ శాంతి, హిందూ-ముస్లింల ఐక్యంగా ఉండాలని ఆకాంక్ష
ఆల్కహాల్ పార్టీ కోసం ఆమెను ఇంటికి పిలిచిన కామాంధుడు.. ఆమెను బయటకు రాకుండా బెడ్రూంలో నిర్బంధించాడు. ఒకటి రెండేళ్లు కాదు ఏకంగా 14 ఏళ్లపాటు బంధించి.. 1000 సార్లకిపైగా అత్యాచారానికి పాల్పడి పైశాచిక ఆనందం పొందాడు. సెక్స్ బానిసగా చేసుకుని ఆమెను కత్తితో బెదిరిస్తూ ఇంట్లో పనులు చేయించుకునేవాడు. ఆ కామాంధుడి బారి నుంచి తప్పించుకోవడానికి ఆమె ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలించలేదు. చివరికి ఆమె దీనస్థితికి చలించిపోయిన.. నిందితుడి తల్లి వాడి చెర నుంచి విడిపించడంలో సహాయం చేసింది. ఆమె సాయంతో ఆ నరకం నుంచి బయటపడిన బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. 19 ఏళ్ల వయసులో అతడికి చిక్కిన ఆమె వయసు ప్రస్తుతం 33 ఏళ్లు. జరిగినదంతా పోలీసులకు వివరించిన ఆమె.. తనని 14 ఏళ్లు బంధించి 1000 సార్లకుపైగా అత్యాచారం చేశాడని పేర్కొంది. కత్తితో బెదిరించి ఇంట్లో పనులు చేయించుకున్నాడని, చిన్న చిన్న విషయాలకు కూడా తీవ్రంగా హింసించి నరకం చూపించాడని కన్నీటిపర్యంతమైంది.
Also Read : రన్నింగ్‌లో ఉండగానే రెండు ముక్కలైన బైక్.. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న యువకుడు
అంతేకాదు, తనను బంధీగా ఉంచిన ఇంటికే మరో మహిళని తీసుకొచ్చాడని, వారిద్దరికీ గొడవ జరగడంతో ఆమెను 2011లో దారుణంగా హత్యచేశాడని తెలిపింది. కత్తితో అనేకసార్లు పొడిచి అతి కిరాతకంగా చంపినట్టు వివరించారు. బాధితురాలు ఎకతీరానా ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. నిందితుడు వ్లాదిమిర్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులకు అక్కడ భయంకరమైన వస్తువులు కనిపించాయి. సెక్స్ టాయ్స్, పోర్న్ వీడియోలతో ఆ ఇళ్లంతా నిండిపోవడం చూసి వారు షాకయ్యారు. వీటితో పాటు మానవ అవశేషాలు కూడా లభ్యమయ్యాయి. నిందితుడిపై అత్యాచారం, హత్య, కిడ్నాప్ ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వ్లాదిమిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్టు గుర్తించారు. మానసిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- వీడిన సస్పెన్స్… కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి జూపల్లి
- తెలంగాణ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ విడుదల.. కీలక నేతలంతా అసెంబ్లీ బరిలోనే
- గుండె తరుక్కుపోతోంది, ప్రభుత్వం స్పందించాలి… వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై
- క్రైమ్ మిర్రర్ కథనానికి స్పందన.. నూతన 108 అంబులెన్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే
- చంద్రబాబు రోడ్ షోలో అగ్నిప్రమాదం… మంటలు అంటుకున్నా స్పీచ్ కంటిన్యూ
2 Comments