
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సాగుకు 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పింది. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తోంది. ప్రతిపక్షాలు చేసే విమర్శలకు నిరంతర విద్యుత్ అమలుతోనే సమాధానం చెబుతోంది. ఎన్నో ఆటు పోట్లు.. ఎంతో వ్యయంతో కూడిన నిర్ణయం అమలు చేస్తోంది ఎన్నో సమస్యలు వాటికి పరిష్కారాలు..ప్రభుత్వ శ్రమ ఫలితంగా తెలంగాణ అంతటా నిరంతర విద్యుత్తు వెలుగులు విరజిమ్మాయి. 2004 నుంచి 2014 వరకు ఉన్న కరెంటు సరఫరా తీరు..రాష్ట్ర విభజన తరువాత విద్యుత్ అమలు పైన చర్చకు ప్రభుత్వంలోని మంత్రులు సవాల్ విసురుతున్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందిస్తున్నదేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించింది. విద్యుత్తు వ్యవస్థ బలోపేతానికి 37,911 కోట్లు ఖర్చు చేసింది. వినియోగంలో 33% వాటా వ్యవసాయానిదేనని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. లక్షల్లో సాగు విద్యుత్ కనెక్షన్లు పెరిగాయి.
Read Also : నడి రోడ్డుపై ఏంట్రా ఇది.. మీరు మారరా?
2018 నుంచి ఇప్పటి వరకు నిరంతర ఉచిత్ విద్యుత్ తెలంగాణ రైతులకు అందుతోంది. 2018 జనవరి 1 తెలంగాణ రైతాంగం కోసం సీఎం కేసీఆర్ ఎన్నో వ్యవ ప్రయాసలు..ప్రణాళికలతో ఈ పథకం అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ ఏర్పాటు సమయానికే విద్యుత్ లోటు ఉంది. వ్యవసాయం..పరిశ్రమలకు కోతలతో బాధతలు తప్పేవి కాదు. రాత్రి పూట పాములు, తేళ్లు, విషపు పురుగుల కాట్లతో ఎంతోమంది రైతన్నలు చేన్లలోనే ప్రాణాలు విడిచారు. పంటలు చేతికి రాక.. కండ్లముందే ఎండిపోతుంటే చూడలేక పురుగుల మందు తాగి విగతజీవులైనవారు వందల మంది ఉన్నారు. రైతుల విద్యుత్తు కష్టాలను స్వయంగా చూసిన కేసీఆర్ కు అవే రైతుకు ఏదైనా చేయాలి, ఎంతైనా చేయాలి, ఎంత చేసినా తక్కువే అన్న ఆలోచనకు దారి తీశాయి. ఆ ఆలోచనే.. 24 గంటల నిరంతర విద్యుత్ నిర్ణయానికి కారణమైంది. రాబోయే రోజుల్లో వచ్చే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్తు అందించేందుకు ఏమేం కావాలన్నదానిపై పక్కాగా ప్రణాళిక సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో 24 గంటల పాటు విద్యుత్తును నిరంతరాయంగా అందించేందుకు వ్యవస్థల బలోపేతంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ట్రాన్స్‌కో, డిస్కం వ్యవస్థలను పటిష్ఠం చేసేందుకు రూ.37,911 కోట్లు ఖర్చు చేసింది.
Also Read : మహారాష్ట్ర నుంచి బరిలో కేసీఆర్?…జాతీయ మీడియాలో జోరుగా కథనాలు
ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్యను గణనీయంగా పెంచడం, తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచడం ముఖ్యమని గుర్తించారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేయాలని సంకల్పించారు. ఈ ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. ఒక్కో జిల్లాను అనుసంధానం చేసుకొంటూ, అన్ని జిల్లాలను అనుసంధానం చేశారు. సాంకేతిక సమస్యలను, లోటుపాట్లను ఎప్పటికప్పుడు పరిష్కరించి పథకం అమల్లోకి తెచ్చారు. తెలంగాణ ఏర్పడే నాటికి 74 మెగావాట్లుగా ఉన్న సౌర విద్యుత్తును 5,117 మెగావాట్లకు తీసుకుపోయారు. యాదాద్రిలో 4,000 మెగావాట్లు సహా మరో 8,705 మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటికోసం రూ.వేల కోట్లు ఖర్చు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో వినియోగించే విద్యుత్తులో 33 శాతం వ్యవసాయానికే వినియోగిస్తున్నట్టు అధికారులు లెక్కలు వేశారు. వానకాలంలో కంటే.. యాసంగిలో వ్యవసాయానికి విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉంటున్నది. అందుకు అనుగుణంగానే విద్యుత్తు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. రూ.37,911 కోట్లతో ట్రాన్స్‌మిషన్, డిస్కం వ్యవస్థలను బలోపేతం చేశాం. ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్యను, సామర్థ్యాన్ని గణనీయంగా పెంచారు. ఫలితంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంటు ఇవ్వడం విజయవంతమైంది.
ఇవి కూడా చదవండి :
- కర్నూలు జిల్లాలో మహిళ పంట పండింది.. పొలంలో కలుపు తీస్తుండగా దొరికిన వజ్రం
- ఒక టమాటా.. జీవితాన్నే మార్చింది.. రూ.కోట్లు కురిపించింది!
- టీ కాంగ్రెస్‌లో పార్టీ పదవుల లొల్లి.. కార్యకర్తలకు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- రాజాసింగ్‌కు మరో షాక్.. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా టాలీవుడ్ నిర్మాత..?
- తెలంగాణలో మరో రాజకీయ పార్టీ.. ప్రకటించిన కేంద్ర మాజీ మంత్రి తనయుడు
One Comment