
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఎన్నికల సన్నాహక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జులై చివరి వారం కల్లా 70 మంది అభ్యర్థుల జాబితా ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సర్వేల ఆధారంగా గెలుపొందే అవకాశం ఉన్న అభ్యర్ధులకే మాత్రమే టికెట్లు కేటాయించనున్నారు. సీటు కోసం పోటీ తక్కువ ఉన్న నియోజకవర్గాలకు తొలుత అభ్యర్థులను ప్రకటించనున్నారు. సీటు కోసం పోటీ ఎక్కువ ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ఖరారు కొంత ఆలస్యం కానుందని హస్తం వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల్లో టీ కాంగ్రెస్ ఎన్నికల సమన్వయ కమిటీని ఏఐసీసీ ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా త్వరలో ఫైవ్ గ్యారంటీస్ ప్రకటన చేసే అవకాశముంది.
Read Also : ఈటల రాజేందర్‌కు వై కేటగిరీ భద్రత… త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు!!!
అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా డిక్లరేషన్లను కూడా త్వరలో ప్రకటించనున్నారు. ఇప్పటికే రైతులు, నిరుద్యోగ యువత కోసం డిక్లరేషన్లు ప్రకటించారు. అధికారంలోకి వస్తే వారి కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెడతామనేది ఆ డిక్లరేషన్లలో పొందుపర్చారు. వరంగల్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించగా.. హైదరాబాద్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ నిరుద్యోగ డిక్లరేషన్‌లో పొందుపర్చిన అంశాలను వివరించారు. అలాగే సామాజికవర్గాల వారీగా కూడా డిక్లరేషన్లను ప్రకటించేందుకు టీపీసీసీ సిద్దం అవుతోంది. ఈ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలనే మేనిఫెస్టోలో పెట్టనున్నారు. మహిళల ఓట్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా మహిళా డిక్లరేషన్ ప్రకటించనున్నారు. ప్రియాంకగాంధీతో మహిళా డిక్లరేషన్ ప్రకటన చేయించేలా టీ కాంగ్రెస్ వర్గాలు ప్రయత్నాలు చేస్తోన్నాయి. ఈ డిక్లరేషన్లలో ప్రకటించిన అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో పాటు చేరికలపై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టింది.
Also Read : బీఆర్ఎస్‌లో అసంతృప్తితో తీగల కృష్ణారెడ్డి.. టికెట్ ఇవ్వకపోతే గుడ్ బై అంటూ వ్యాఖ్యలు
ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు జులై 2న ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగే 34 మంది నేతలు హస్తం గూటికి చేరేందుకు సిద్దమయ్యారు. ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న మరికొంతమంది నేతలతో రాహుల్ టీమ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయిందనే ఊహాగానాలతో.. ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా టీ పాలిటిక్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఆ ఇద్దరు నేతలు మాత్రం ఖండిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఎవ్వరినీ వదిలిపెట్టను.. సీఎం కేసీఆర్, కవితపై మోదీ సంచలన వ్యాఖ్యలు
- మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది.. సర్కోలి సభలో సీఎం కేసీఆర్
- ఈటల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర.. ఈటల జమున సంచలన ఆరోపణలు
- సీఎం కేసీఆర్‌కు ప్రేమతో.. అపురూప బహుమతినిచ్చిన సామాన్య వృద్ధుడు
- బీజేపీ నుంచి నేను వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు.. ఈటల సంచలన వ్యాఖ్యలు
3 Comments