KhammamTelangana

100 ఎకరాల్లో 5 లక్షల మందితో పొంగులేటి చేరిక సభ.. జనగర్జనగా సభకు నామకరణం

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జులై 2న కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా రానుండగా.. ఈ సందర్భంగా లక్షలాది మంది ప్రజల సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎస్ఆర్ గార్డెన్స్ పక్కన ఉన్న వంద ఎకరాల స్థలంలో సభకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సభకు జనగర్జనగా నామకరణం చేశారు.

Read Also : 2011లో సచిన్ కోసం వరల్డ్ కప్ గెలిచాం.. 2023లో ఆ ప్లేయర్ కోసం భారత్ గెలవాలనుకుంటుంది: సెహ్వాగ్

5 లక్షలకుపైగా ప్రజలను ఈ సభకు తరలించేందుకు పొంగులేటితో పాటు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. చాలాకాలం తర్వాత తెలంగాణలో రాహుల్ గాంధీ బహిరంగ సభలో పాల్గొననుండటం, ఎన్నికలు సమీపిస్తుండటంతో.. దీనిని గ్రాండ్ సక్సెస్ చేయాలని భావిస్తున్నారు. సభకు వచ్చే ప్రజల కోసం 50 ఎకరాల స్థలాన్ని పార్కింగ్‌కు కేటాయించారు. ఈ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు రేపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు రానున్నారు. సభా స్థలాన్ని పరిశీలించి పలు కీలక సూచనలు చేయనున్నారు.

Also Read : ఈటల భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా… డీజీపీ అంజనీ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి

ఈ సభ ఏర్పాట్లపై చర్చించేందుకు నేడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు. రాహుల్ గాంధీ ఆదేశాలతో సభ విధివిధానాలపై చర్చించేందుకు భట్టితో ఆయన భేటీ కానున్నారు. సభ ఏర్పాట్లు, జన సమీకరణ, ఇతర అంశాలపై మాట్లాడనున్నారు. ఈ సభకు ఏఐసీసీ అగ్రనేతలతో పాటు రాష్ట్ర ముఖ్యనేతలందరూ హాజరుకానున్నారు. ఈ సభ ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. పొంగులేటి, జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఈ సభలో హస్తం గూటికి చేరనున్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. తెలంగాణా బీజేపీ కోసం రంగంలోకి 600మంది… జులై 8న కీలక సమావేశం!!
  2. తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి.. వచ్చే నెలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు
  3. ఈటల రాజేందర్‌కు వై కేటగిరీ భద్రత… త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు!!!
  4. బీఆర్ఎస్‌లో అసంతృప్తితో తీగల కృష్ణారెడ్డి.. టికెట్ ఇవ్వకపోతే గుడ్ బై అంటూ వ్యాఖ్యలు
  5. ఎవ్వరినీ వదిలిపెట్టను.. సీఎం కేసీఆర్, కవితపై మోదీ సంచలన వ్యాఖ్యలు

ad 728x120 SRI copy - Crime Mirror

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.