
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి భేటీ కావడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోమవారం బెంగళూరులో డీకే శివకుమార్‌తో షర్మిల సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఇటీవల కర్ణాటక ఫలితాల తర్వాతి రోజు డీకే బర్త్ డే సందర్భంగా బెంగళూరు వెళ్లి ఆయనను షర్మిల కలిశారు. డీకేకు బర్త్ డే విషెస్ తెలపడంతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందుకు షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు. కేవలం 15 రోజుల్లోనే డీకే శివకుమార్‌తో రెండోసారి షర్మిల భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీకే చేసిన కృషిని షర్మిల ఇటీవల ప్రశంసించారు.
Read Also : హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ కన్ను… ఆ 15 మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ కష్టమేనా?
ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో డీకేకు కూడా సాన్నిహిత్యాన్ని గుర్తు చేశారు. వైఎస్ కుటుంబంతో డీకే శివకుమార్‌కు ఎప్పటినుంచో సత్సంబంధాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆయనను షర్మిల కలిసినట్లు చెబుతుండగా.. ఒకే నెలలో రెండుసార్లు భేటీ కావడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. కర్ణాటక తర్వాత ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న తెలంగాణపై కాంగ్రెస్ కన్నేసింది. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా వైఎస్ షర్మిలను కలుపుకుంటే పార్టీకి ప్లస్ అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోన్నట్లు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా ఆ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్న డీకేను మధ్యవర్తిగా రంగంలోకి దింపినట్లు టాక్ నడుస్తోంది.
Also Read : మరోసారి ఆలస్యం కానున్న జనగణన ప్రక్రియ.. లోక్‌సభ ఎన్నికల తర్వాతే
షర్మిలను కలుపుకోవడం వల్ల తెలంగాణతో పాటు ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీకి లాభం జరుగుతుందని హస్తం వర్గాలు భావిస్తున్నట్లు ఇటీవల పలు పత్రికల్లో వార్తలొచ్చాయి. కాంగ్రెస్‌తో వైఎస్సార్‌టీపీ పొత్తు పెట్టుకుంటుందని, అవసరమైతే పార్టీని విలీనం కూడా చేయవచ్చనే వార్తలొచ్చాయి. ప్రియాంకగాంధీ ఇటీవల షర్మిలకు ఫోన్ చేసి తమ పార్టీతో కలిసి నడవాలని ఆహ్వానించారని, అందుకు షర్మిల కూడా ఓకే చెప్పినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షర్మిల కూడా ఈ వార్తలను సమర్థించేలా వ్యాఖ్యలు చేశారు. పొత్తు కోసం తనకు కాల్స్ వస్తున్నాయని, కానీ లిఫ్ట్ చేయడం లేదని మీడియాకు చెప్పారు. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తాననే వార్తలను మాత్రం తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ పెట్టి పాదయాత్ర చేసింది వేరే పార్టీ కోసం కాదని వ్యాఖ్యానించారు. ఏ పార్టీతోనూ వైఎస్సార్‌టీపీ పొత్తు పెట్టుకోదని తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై కూడా షర్మిల ఫైర్ అయ్యారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో కర్ణాటక ప్లాన్.. జూన్ చివరిలోగా అభ్యర్థులు ఖరారు..!!
- లారీల కోసం రైతుల ఎదురుచూపులు… ధాన్యం బస్తాల వద్ద పడిగాపులు
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు.. విద్యుత్ శాఖ డీఈ అరెస్ట్
- విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ ఉపగ్రహం…
- వెలుగులోకి భారీ మోసం… ట్రస్ట్‌కు విరాళం పేరుతో 15 లక్షలు కొట్టేసిన కేటుగాడు