
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ శివారు ప్రాంతంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నాలుగు రోజుల క్రితం యువకుడు మృతి చెందగా.. ఆలస్యంగా ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. హయత్ నగర్ శివారులోని నిర్మానుష్య ప్రాంతం నుంచి గత రెండు రోజులుగా దుర్వాసన వస్తుంది. అది గమనించిన స్థానికులు.. దగ్గరకు వెళ్లి చూడగా వారికి కుల్లిపోయిన స్థితిలో ఓ మృతదేహాం కనిపించింది. మృతదేహాంపై బట్టలు కూడా లేవు. దీంతో భయభ్రాంతులకు గురైన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు.
Read Also : తెలంగాణాలో 25 మందితో బిజేపి అభ్యర్థుల మొదటి లిస్ట్ వైరల్… నియోజకవర్గాలలో ఆసక్తికర చర్చ
గుర్తు తెలియని కొందరు దుండగులు హత్య చేసి నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. మృతుడిని నాలుగు రోజుల క్రితమే చంపేసినట్లుగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు మృతుడి వివరాల కోసం ఆరా తీశారు. మృతదేహానికి సమీపంలోనే ఫ్యాంటు, పర్సు, షూ లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా మృతుడు వరంగల్‌కు చెందిన రాజేష్ (23) గా పోలీసులు గుర్తించారు. రాజేష్ హయత్ నగర్ శివారులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇబ్రహీంపట్నంలో స్నేహితుడి వివాహం ఉందంటూ ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పిన రాజేశ్ ఈనెల 20న వరంగల్ నుంచి హైదరాబాదుకు వచ్చాడు.
Also Read : డీకే శివకుమార్‌తో మరోసారి షర్మిల భేటీ… కాంగ్రెస్‌తో పొత్తు వార్తల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత
దిల్‌సుఖ్ నగర్‌లో ఫ్రెండ్ రూమ్‌కు చేరుకున్న రాజేశ్… ఈనెల 22 వరకు అక్కడే ఉన్నాడు. ఇబ్రహీంపట్నం వెళ్తున్నానని చెప్పి ఈనెల 23న ప్రెండ్ రూం నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మళ్లీ అతని ఫ్రెండ్‌కు ఫోన్ చేసిన రాజేశ్.. వరంగల్ వెళ్లేందుకు డబ్బులు కావాలని అడగ్గా.. అతడు ఆన్‌లైన్‌లో పంపించాడు. 26వ తేదీన రాజేశ్ ఫోన్ రింగ్ అయినా.. అతడు లిఫ్ట్ చేయలేదని డబ్బులు పంపిన స్నేహితుడు వెల్లడించాడు. 27వ తేదీ నుంచి ఫోన్ స్విచ్ఛాప్ వచ్చిందని తెలిపాడు. అయితే వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రాజేష్‌ను ఎవరు హత్య చేశారు ? పెళ్లి తర్వాత ఎక్కడికి వెళ్లాడు ? అతడిని చంపాల్సిన అవసరం ఎవరికుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ కన్ను… ఆ 15 మంది ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ కష్టమేనా?
- మరోసారి ఆలస్యం కానున్న జనగణన ప్రక్రియ.. లోక్‌సభ ఎన్నికల తర్వాతే
- తెలంగాణలో కర్ణాటక ప్లాన్.. జూన్ చివరిలోగా అభ్యర్థులు ఖరారు..!!
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు.. విద్యుత్ శాఖ డీఈ అరెస్ట్
- వెలుగులోకి భారీ మోసం… ట్రస్ట్‌కు విరాళం పేరుతో 15 లక్షలు కొట్టేసిన కేటుగాడు
One Comment