
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : టీఎస్‌పీఎస్ పేపర్ లీకేజీ కేసు విచారణలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 44 మందిని అరెస్టు చేయగా.. తాజాగా మరొకరు అరెస్టు అయ్యారు. దీంతో మెుత్తం అరెస్టుల సంఖ్య 45కు చేరుకుంది. వరంగల్ జిల్లాలో విద్యుత్ శాఖలో డివిజనల్ ఇంజనీర్‌గా పని చేస్తున్న రమేష్ అనే వ్యక్తిని సిట్ అధికారులు తాజాగా అరెస్టు చేశారు. రమేశ్ డీఈగా పని చేస్తూనే అశోక్ నగర్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో ఫ్యాకల్టీగా పని చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన రవి కిషోర్ నుంచి ఏఈఈ సివిల్, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నాపత్రాలను రమేశ్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది.
Read Also : విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ ఉపగ్రహం…
ఈ క్రమంలోనే రమేశ్‌ను అరెస్టు చేశారు. అతడిని విచారించగా.. తాను పేపర్లను మరో ఇరవై మందికి అమ్మినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. తనకు కోచింగ్ సెంటర్‌లో పరిచయమైన కొందరు అభ్యర్థలకు ఆ పేపర్లను విక్రయించినట్లు చెప్పాడు. దీంతో వారి వివరాలను సేకరించిన సిట్ అధికారులు.. పేపర్ కొనుగోలు చేసిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రమేశ్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉండగా.. గ్రూప్1, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర పరీక్షల్లో టాపర్లను సైతం సిట్ అధికారులు విచారించారు. వారిని హైదరాబాద్ సిట్ పోలీసులు వేర్వేరుగా పిలిచి విచారణ నిర్వహించారు. చాలా మంది పేపర్లు కొనుగోలు చేసి పరీక్షలు రాసినట్లు తెలటంతో వారందని పిలిచి విచారిస్తున్నారు.
Also Read : వెలుగులోకి భారీ మోసం… ట్రస్ట్‌కు విరాళం పేరుతో 15 లక్షలు కొట్టేసిన కేటుగాడు
టాపర్ల నుంచి వచ్చే సమాధానాలను బట్టి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసి పరీక్ష రాసిన వారిని గుర్తించే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు. అయితే.. విచారణలో అధికారులకు వింత పరిస్థితి ఎదురవుతుంది. కనీస పరిజ్ఞానం లేకపోయినా చాలా మంది పరీక్షల్లో టాపర్లుగా నిలిచినట్లు సమాచారం. ఏ మాత్రం సబ్జెట్ నాల్జెడ్ లేకున్నా చాలా మంది పోటీ పరీక్షల్లో టాపర్లు నిలిచినట్లు తెలిసింది. ఏడో తరగతి పిల్లలు ఠక్కున చెప్పే చిన్న చిన్న మ్యాథ్స్ సూత్రాలను కూడా వారు చెప్పలేకపోయారు. ఏఈ టాపర్‌గా నిలిచిన ఓ యువకుడిని(A+B)2 ఎంత అని అధికారులు అడిగితే.. అతడు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలిసింది. ఏఈ టాపర్ అంత చిన్న సూత్రానికి సమాధానం చెప్పలేకపోవటంతో అధికారులు నెవ్వెరపోయినట్లు సమాచారం. మార్చి 5న పరీక్ష రాసిన టాపర్లంతా రెండు నెలలకే సమాధానాలు మరిచిపోయామని చెప్పటంతో అధికారులు తలలు పట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- హైదరబాద్ లో విషాదం… పెళ్లంటే భయంతో యువతి ఆత్మహత్య
- అనురాధ హత్య కేసులో ట్విస్ట్… రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు
- ధాన్యం కుప్ప వద్ద కాపలాగా పడుకున్న రైతు… పైనుంచి ట్రాక్టర్ వెళ్లటంతో మృతి
- ‘ప్రేమించిన అమ్మాయి కంటే కట్నమే ఎక్కువ’… పెళ్లి పీటలపై నుంచి ప్రేమికుడు పరార్
- టిప్పు సుల్తాన్ ఖడ్గం వేలం… 144 కోట్లు పలికి ఆశ్చర్యపరిచిన కత్తి
One Comment