
క్రైమ్ మిర్రర్, ములుగు ప్రతినిధి : జిల్లాలోని గోవిందరావుపేట మండలం చల్వాయి లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం సిపిఐ బృందం సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ.. ఆరుకాలం కష్టపడుతున్న రైతాంగానికి, చివరికి లారీలు రాక కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలతో పడిగాపులు పడవలసిన పరిస్థితి ఉందని అన్నారు. రైతు ప్రభుత్వం మాది అనే పాలకులకు, లారీలు సమకూర్చాలనే ఆలోచన ఎందుకు లేదని, స్థానిక ప్రజాప్రతినిధులకు ఈ సమస్య కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గతంలోనే తూకాలు వేయక, వేసినా లారీలు సప్లై చేయక వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసి రైతులు చాలా నష్టపోయారు. మల్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీలు సమకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సారయ్య, శ్రీనివాసరావు, కుమార్, సమ్మయ్య, సమ్మక్క, కొమురమ్మ, సంపత్, ఓదెలు, శంకర్, రైతులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- మరోసారి ఆలస్యం కానున్న జనగణన ప్రక్రియ.. లోక్‌సభ ఎన్నికల తర్వాతే
- తెలంగాణలో కర్ణాటక ప్లాన్.. జూన్ చివరిలోగా అభ్యర్థులు ఖరారు..!!
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు.. విద్యుత్ శాఖ డీఈ అరెస్ట్
- విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ ఉపగ్రహం…
- వెలుగులోకి భారీ మోసం… ట్రస్ట్‌కు విరాళం పేరుతో 15 లక్షలు కొట్టేసిన కేటుగాడు