
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో హ్యాట్రిక్ విజయంపై అధికార బీఆర్ఎస్ కన్నేసింది. ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సంక్షేమ పథకాల అమలులో స్పీడ్ పెంచింది. పార్టీ కార్యకర్తలకు చేరువయ్యేందుకు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్‌కు 105 సీట్లు రావటం ఖాయమని సీఎం కేసిఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. తనకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ఉద్దేశం లేదని.. ఎమ్మెల్యేలు స్వతహాగా పొరపాట్లు చేస్తే తప్ప సిట్టింగ్‌లందరికీ సీట్లు ఇస్తామని అన్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం కేసీఆర్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కాకుండా వారంతా నియోజవర్గానికి దూరంగా ఉంటున్నట్లు సర్వేల ద్వారా వెల్లడైనట్లు తెలిసింది.
Read Also : తెలంగాణలో కర్ణాటక ప్లాన్.. జూన్ చివరిలోగా అభ్యర్థులు ఖరారు..!!
సదరు ఎమ్మెల్యేలు నియోజవర్గంలోని కింది స్థాయి నేతలను కూడా కలుపుకొని పోవటం లేదని.., పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని సీఎంకు నివేదిక అందినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి ఎమ్మెల్యేలను ప్రగతి భవన్‌కు పిలిపించుకున్న సీఎం కేసీఆర్ గట్టిగా క్లాస్ తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మెుత్తం 15 మంది ఎమ్మెల్యేలు తమ నియోజవర్గాల్లో బాగా వెనకబడి పోయారని.. వారి పట్ల ప్రజల్లో విశ్వసనీయత లేదని సర్వే నివేదికలు అందినట్లు తెలిసింది. వెనుకబడిన ఎమ్మెల్యేలు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అప్రమత్తం చేస్తూనే.. నడవడిక మార్చుకోకుంటే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎం కేసీఆర్ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో వ్యతిరేకత ఉన్న, గెలవడం అసాధ్యమనుకున్న వారిని మార్చిన విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తు చేస్తుంది.
Also Read : మరోసారి ఆలస్యం కానున్న జనగణన ప్రక్రియ.. లోక్‌సభ ఎన్నికల తర్వాతే
ఆ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చిన స్థానాలన్నీ బీఆర్ఎస్ పార్టీకే దక్కాయని.. ఈసారి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా సిట్టింగ్‌లందరూ కష్టపడి ప్రజాక్షేత్రంలో తిరగాలని అధినేత సూచించినట్లు తెలిసింది. ఇక గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 88 స్థానాల్లో విజయం సాధించగా.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ స్థానాల్లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారు టికెట్ల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తాండూరులో మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి వంటి నేతలు టికెట్ల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా.. వారికి సీఎం సర్దిచెప్పినట్లు సమాచారం. మరోరకంగా పార్టీ నుంచి లబ్ధి చేకురుస్తామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇలా పార్టీ లైన్ దాటకుండా హ్యాట్రిక్ విజయం కోసం సమష్టిగా పాటు పడాలని సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
- లారీల కోసం రైతుల ఎదురుచూపులు… ధాన్యం బస్తాల వద్ద పడిగాపులు
- టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక మలుపు.. విద్యుత్ శాఖ డీఈ అరెస్ట్
- విజయవంతంగా నింగిలోకి భారత రెండో తరం నావిగేషన్ ఉపగ్రహం…
- వెలుగులోకి భారీ మోసం… ట్రస్ట్‌కు విరాళం పేరుతో 15 లక్షలు కొట్టేసిన కేటుగాడు
- ‘ప్రేమించిన అమ్మాయి కంటే కట్నమే ఎక్కువ’… పెళ్లి పీటలపై నుంచి ప్రేమికుడు పరార్
3 Comments