
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కరెంట్ బిల్లు చెల్లించాలని అడిగిన ఓ విద్యుత్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించాడు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. బూతులు తిడుతూ చితకబాదాడు. తమ ఇంటి కరెంట్ బిల్లును రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వమే కడుతుందని చెప్పాడు. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లా కుకునాపల్లిలో రెండు రోజుల కిందట చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటక అసెంబ్లీకి ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఉచిత కరెంట్ ఇస్తామని ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చాలా మంది పౌరులు కరెంట్ బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు.
Read Also : ‘ప్రేమించిన అమ్మాయి కంటే కట్నమే ఎక్కువ’… పెళ్లి పీటలపై నుంచి ప్రేమికుడు పరార్
కుకునాపల్లికి చెందిన చంద్రశేఖర్ హైర్‌మత్ ఇంటి మీటర్‌పై రూ. 9000 విద్యుత్ బిల్లు పెండింగ్ ఉంది. గత 6 నెలలుగా అతడు కరెంట్ బిల్లు చెల్లించట్లేదు. గుల్బర్గా విద్యుత్ సరఫరా సంస్థకు చెందిన ఉద్యోగి మంజునాథ్.. రెండు రోజుల కిందట కుకునాపల్లి ప్రాంతంలో మీటర్ రీడింగ్‌లు నమోదు చేసేందుకు వచ్చారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ ఇంటి వద్దకు రాగా ఆయనతో మంజునాథ్ వాగ్వాదానికి దిగాడు. కోపంతో రెచ్చిపోయిన చంద్రశేఖర్.. మంజునాథ్ చెంపపై నుంచి కొట్టాడు. దుర్భాషలాడాడు. ఆ తర్వాత కాలికి ఉన్న చెప్పు తీసుకొని దాడి చేశాడు. ‘కరెంట్ బిల్లు గురించి మాట్లాడారో.. చెప్పు తీసుకొని కొడతా’ అంటూ హెచ్చరించాడు. ఆ ఘటనను చిత్రీకరిస్తున్న మరో ఉద్యోగిపైనా దౌర్జన్యం ప్రదర్శించాడు. సెల్ ఫోన్‌ను లాక్కునే ప్రయత్నం చేశాడు. కుటుంబసభ్యులు, స్థానికులు అతడిని వారించే ప్రయత్నం చేశారు.
Also Read : హైదరాబాద్ జవహర్‌నగర్‌లో విషాదం… ప్రియుడి ఇంట్లో ప్రియురాలు ఆత్మహత్య
‘విద్యుత్ మీటర్ రిజిస్ట్రేషన్‌ను మార్చమని GESCOM సిబ్బందిని నేను చాలా రోజుల నుంచి కోరుతున్నాను. వారు దాన్ని చేయలేదు. నేను కరెంట్ బిల్లు చెల్లించను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని చంద్రశేఖర్ హెచ్చరించాడు. కర్ణాటకలో సాధారణ ప్రజలు కరెంటు బిల్లులు చెల్లించేందుకు నిరాకరిస్తున్న ఘటనలు కొన్ని రోజులుగా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. బెళగావిలో బుధవారం కొంత మంది గ్రామస్థులు విద్యుత్ బిల్లులు చెల్లించడానికి నిరాకరించారు. ‘ఉచిత విద్యుత్ ఇస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసింది, విద్యుత్ మీటర్లను తొలగించండి’ అంటూ విద్యుత్ సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఈ అంశంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందన కోసం అక్కడి ప్రజలు, అధికారులు ఎదురు చూస్తున్నారు. ఆయన ఏం చెప్తారో వేచి చూడాలి మరి!
ఇవి కూడా చదవండి :
- రేపు హైదరాబాదుకు కేజ్రివాల్… సిఎం కేసిఆర్ తో భేటీ
- బీఆర్ఎస్ రాకుంటే నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం ఆగిపోతుందా… కిషన్ రెడ్డి ఫైర్
- ముచ్చటగా మూడవసారి బీఆర్ఎస్ పార్టీదే అధికారం… మంత్రి హరీష్ రావు
- నాలుగు నెలల్లో వివాహం… కాబోయే భార్యను కాపాడబోయి యువకుడి మృతి…
- ఫేక్ బాబా… పూజల పేరుతో బలవంతపు వసూళ్లు, అదుపులోకి తీసుకున్న పోలీసులు
One Comment