
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : లండన్‌లో నిర్వహించిన వేలంలో ఓ ఖడ్గం అత్యధిక ధర పలికి అందర్ని అవాక్కయ్యేలా చేసింది. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఈ ఖడ్గం వేలంలో ఏకంగా కోటీ 40 లక్షల 80 వేల 900 పౌండ్లు పలికింది. అంటే మన కరెన్సీలో రూ. 144 కోట్లకు పైనే ఉంటుంది. 18 వ శతాబ్దం నాటి ఈ ఖడ్గాన్ని లండన్‌లోని బోన్హమ్స్ ఆక్షన్ హౌస్ వేలం వేసింది. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని చెల్లించకుండా పారిపోయిన బిజినెస్‌మెన్ విజయ్ మాల్యా.. గతంలో ఒకసారి ఈ ఖడ్గాన్ని కొనుగోలు చేసి.. మళ్లీ విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ టిప్పు సుల్తాన్ ఈ ఖడ్గాన్ని మే 23న వేలం వేసినట్లు బోన్హమ్స్ సంస్థ వెల్లడించింది. ఈ ఖడ్గాన్ని సొంతం చేసుకునేందుకు వేలంలో ముగ్గురు బిడ్డర్లు విపరీతంగా పోటీ పడినట్లు పేర్కొంది.
Read Also : చెరువులో డ్రమ్ములో మృతదేహాం… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
చివరకు 14 మిలియన్ పౌండ్లకు ఈ టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని ఓ బిడ్డర్ దక్కించుకున్నట్లు బోన్హమ్స్ ఆక్షన్ హౌస్ తెలిపింది. అయితే ఈ ఖడ్గాన్ని ఎవరు కొనుగోలు చేశారన్న వివరాలను మాత్రం ఆ సంస్థ వెల్లడించలేదు. తాము అంచనా వేసిన దానికంటే 7 రెట్లు ఎక్కువ ధరకు ఖడ్గం అమ్ముడుపోయిందని ఆక్షన్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. టిప్పు సుల్తాన్ ఉపయోగించిన ఆయుధాల్లో దీన్ని అత్యంత శక్తివంతమైన ఖడ్గంగా భావిస్తారని.. అందుకే దీనికి అంత ధర పలికిందని చెప్పింది. టిప్పు ప్యాలెస్‌లోని ప్రైవేటు క్వార్టర్స్‌లో దీన్ని గుర్తించినట్లు బోన్హమ్స్ సంస్థ వెల్లడించింది. తాజాగా ఇదే ఖడ్గాన్ని బోన్హమ్స్ వేలం వేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఖడ్గాన్ని ఎక్కడి నుంచి కొన్నారని బోన్హమ్స్ ఆక్షన్ హౌస్‌ను ప్రశ్నించగా.. సమాధానం ఇచ్చేందుకు సంస్థ ప్రతినిధులు నిరాకరించారు. ఈ టిప్పు సుల్తాన్ ఖడ్గాన్ని 2003లో వ్యాపారవేత్త విజయ్ మాల్యా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read : నాలుగు నెలల్లో వివాహం… కాబోయే భార్యను కాపాడబోయి యువకుడి మృతి…
లండన్‌లోని ఓ ఆక్షన్ హౌస్ నుంచి ఆయన కొన్నారని సమచారం. అప్పట్లో ఆ ఖడ్గాన్ని విజయ్ మాల్యా ప్రదర్శనకు కూడా ఉంచారని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత ఖడ్గాన్ని ఆయన విక్రయించినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ ఖడ్గం గురించి 2016లో విజయ్ మాల్యా ఒక ప్రకటన చేశారు. ఈ ఖడ్గం కారణంగా తమ కుటుంబాన్ని దురదృష్టం వెంటాడిందని అప్పట్లో మాల్యా చెప్పినట్లు మీడియా కథనాలు వచ్చాయి. దీంతో ఆ ఖడ్గాన్ని వదిలించుకున్నానని మాల్యా చెప్పినట్లు పేర్కొన్నాయి. అయితే ఆ ఖడ్గాన్ని ఎవరికి విక్రయించారన్నది మాత్రం విజయ్ మాల్యా బయటపెట్టలేదు. భారత్ లోని పలు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా ఎగవేసిన కేసులో విజయ్ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం విజయ్ మాల్యా.. లండన్‌లో ఉంటున్నట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.
ఇవి కూడా చదవండి :
- ‘డిసీజ్ ఎక్స్’… డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన మరో మహమ్మారి ఇదేనా?
- రోజు కూలీ బ్యాంకు ఖాతాలోకి వచ్చిపడ్డ రూ.100 కోట్లు.. ఇంతలో షాకిచ్చిన పోలీసులు
- నల్గొండ జిల్లాలో దారుణం… బాలిక ఇంటికి వెళ్లిన బాలుడి దారుణ హత్య
- కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో ప్రతిపక్షాలకు మోదీ చురకలు
- మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు ఇండియన్ రైల్వే అద్భుత నివాళి.. రైలుకు మేజర్ పేరు
One Comment