
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఇటీవల నగరంలో ప్రారంభమైన ‘నీరా కేఫ్’కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రుచితోపాటు ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రకృతి పానియం కావడంతో నీరాను సేవించేందుకు పెద్ద ఎత్తున నగరవాసులు నీరా కేఫ్‌కు క్యూకడుతున్నారు. స్నేహితులు, కుటుంబాలతో వచ్చి నీరాను సేవించి ఆనందిస్తున్నారు. అంతేగాక, ఇలాంటి నీరా కేఫ్‌లు నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయాలని కోరుతుండటం గమనార్హం. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో వెలసిన నీరా కేఫ్‌కు భారీగా ప్రజలు వస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంటోంది. ప్రతి రోజూ 1300 నీరా బాటిల్స్ విక్రయిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. కాగా, ఒక్కో బాటిల్ ధర రూ. 90గా ఉంది. ఈ లెక్కన రోజుకూ కేవలం నీరా మదనే రూ. 1.17 లక్షల ఆదాయం వస్తుండటం గమనార్హం.
Read Also : ముచ్చటగా మూడవసారి బీఆర్ఎస్ పార్టీదే అధికారం… మంత్రి హరీష్ రావు
ప్రతి రోజు ఉదయం 11 గంటలకు నీరా కేఫ్ తెరుస్తుండగా మూడు, నాలుగు గంటల్లోనే బాటిల్స్ అమ్ముడుపోతున్నాయి. ఇక వీకెండ్‌లో అయితే రెండు గంటల్లోనే మొత్తం నీరా అమ్ముడుపోతోందని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో డిమాండ్‌కు తగిన విధంగా సప్లైని పెంచేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, నీరు సేవించిన నగరవాసులు తమకు కొత్త అనుభూతినిచ్చిందని చెబుతున్నారు. ఆరోగ్యానికి మంచిది కావడంతో కుటుంబం, స్నేహితులతో వచ్చి నీరాను సేవిస్తున్నట్లు తెలిపారు. ‘నీరా తాగితే ఆరోగ్యం బాగుంటుంది. అనేక పోషక విలువలతో కూడిన పానియం ఇది. చాలా రుచిగా ఉండటంతో ఇంటిల్లిపాది కూడా నీరా తాగుదామని అడుగుతుంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచి మెడిసిన్ అని నమ్ముతాం’ అని ఈస్ట్ మారేడుపల్లికి చెందిన ఓ గృహిణి చెప్పింది.
Also Read : టిప్పు సుల్తాన్ ఖడ్గం వేలం… 144 కోట్లు పలికి ఆశ్చర్యపరిచిన కత్తి
మరో ఐటీ ఉద్యోగిని మాట్లాడుతూ.. ‘మొన్నటి వరకు నీరా తాగాలని ఉన్నా దొరికేది కాదు. దాని కోసం ఊళ్లో.. ఒక రోజు సెలవు పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఏడాది కెప్పుడో ఓసారి ఊరెళ్లి నీరా తాగేవాళ్లం. కానీ ఇప్పుడు నీరా తాగాలనుకుంటే నిమిషాల్లో పని. నీరా కేఫ్‌కు వచ్చేసి తాగొచ్చు. స్వచ్ఛమైన నీరాను తాగే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి థ్యాంక్’ అని పేర్కొంది. ఇది ఇలావుండగా, నీరా బాగుందని, ఎలాంటి కెమికల్స్ లేకుండా స్వచ్ఛమైన పానీయం దొరకడం మంచి విషయమని ఇక్కడికి వచ్చిన ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. నీరా కేఫ్‌లను ఐటీ కంపెనీలున్న ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. అక్కడ ఇంకా మంచి డిమాండ్ ఉంటుందని అంటున్నారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
- చెరువులో డ్రమ్ములో మృతదేహాం… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- నాలుగు నెలల్లో వివాహం… కాబోయే భార్యను కాపాడబోయి యువకుడి మృతి…
- రోజు కూలీ బ్యాంకు ఖాతాలోకి వచ్చిపడ్డ రూ.100 కోట్లు.. ఇంతలో షాకిచ్చిన పోలీసులు
- నల్గొండ జిల్లాలో దారుణం… బాలిక ఇంటికి వెళ్లిన బాలుడి దారుణ హత్య
- ‘డిసీజ్ ఎక్స్’… డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన మరో మహమ్మారి ఇదేనా?
One Comment