
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శనివారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో రేపు కేజ్రీవాల్ భేటీ కానున్నారు. ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దేశంలో విపక్షాల మద్దతు కూడగడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపైనే కేసీఆర్‌తో చర్చించనున్నారు. దేశ రాజధాని పరిధి ఢిల్లీలో గ్రూప్ ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గానూ కేంద్ర ప్రభుత్వం మే 19న ప్రత్యేక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. సంబంధిత ఉద్యోగుల విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది.
Read Also : బీఆర్ఎస్ రాకుంటే నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం ఆగిపోతుందా… కిషన్ రెడ్డి ఫైర్
ఈ కమిటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అమలు పరచాల్సిందేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తోపాటు మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆర్డినెన్స్ ద్వారా అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ ట్వీట్టర్ వేదికగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ పలువురు జాతీయ, పార్టీల నేతలను కలిశారు.
Also Read : ‘నీరా కేఫ్’ కు క్యూ కడుతున్న నగరవాసులు… మరికొన్ని కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్
ఈ క్రమంలోనే శనివారం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. పార్లమెంటులో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు మద్దతు కోరనున్నారు. కాగా, కేజ్రీవాల్‌కు ఇప్పటికే బీహార్ సీఎం నితీష్‌కుమార్ , డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సంపూర్ణమద్దతు ప్రకటించారు. మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా సపోర్టు చేశారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తోందని వారు ఆరోపించారు. ఢిల్లీలో పాలనాధికారాలు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే ఉంటాయని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసి సంగతి కేజ్రీవాల్ గుర్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 8 రోజులకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎల్‌జీకి అధికారం కట్టబెట్టిందని.. దీనిపై మరోసారి న్యాయపోరాటం చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి :
- ముచ్చటగా మూడవసారి బీఆర్ఎస్ పార్టీదే అధికారం… మంత్రి హరీష్ రావు
- టిప్పు సుల్తాన్ ఖడ్గం వేలం… 144 కోట్లు పలికి ఆశ్చర్యపరిచిన కత్తి
- ‘డిసీజ్ ఎక్స్’… డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన మరో మహమ్మారి ఇదేనా?
- రోజు కూలీ బ్యాంకు ఖాతాలోకి వచ్చిపడ్డ రూ.100 కోట్లు.. ఇంతలో షాకిచ్చిన పోలీసులు
- నల్గొండ జిల్లాలో దారుణం… బాలిక ఇంటికి వెళ్లిన బాలుడి దారుణ హత్య
One Comment