
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణా సీఎం కేసీఆర్ తెలంగాణా నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ తమిళిసైని ఎందుకు ఆహ్వానించలేదో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రాకపోతే పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం ఆగిపోతుందా అని ప్రశ్నించారు. కావాలని కేంద్రం చేసే ప్రతీ పనిని రాద్దాంతం చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా రామని బాయ్ కాట్ చేస్తున్న ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : ‘నీరా కేఫ్’ కు క్యూ కడుతున్న నగరవాసులు… మరికొన్ని కేంద్రాల ఏర్పాటుకు డిమాండ్
బీఆర్ఎస్ తో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదని పేర్కొన్నారు. ట్విన్ టవర్స్ శిలాఫలకంపై స్థానిక ఎంపీనైన తన పేరే లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించే నీతి ఆయోగ్ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేనని చెప్పటం అత్యంత బాధ్యతా రాహిత్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్టి అన్నారు. కీలక సమావేశాలకు హాజరు కాకపోవటం లాంటి వైఖరివల్ల రాష్ట్రం నష్టపోతోందని చెప్పారు. అభివృద్ది కార్యక్రమాలకోసం ముఖ్యమంత్రికి సమయం లేదని చెప్తున్నారని, కానీ రాజకీయాలకోసం మహారాష్ట్ర వెళ్ళేందుకు సమయం ఉంటుందనీ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
Also Read : ముచ్చటగా మూడవసారి బీఆర్ఎస్ పార్టీదే అధికారం… మంత్రి హరీష్ రావు
సీఎం కేసీఆర్ వైఖరి వల్ల పోరాడి సాధించుకున్న తెలంగాణా తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. కేంద్రంతో అనుక్షణం ఘర్షణలు పడడం వల్ల రాష్ట్రం నష్టపోతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అవకాశం ఉన్న చోట కూడా తెలంగాణ గొంతుకను వినిపించకపోవడం తో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేయాల్సిన అభివృద్ధి విషయంలో విఫలమయ్యారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి అధికారిక కార్యక్రమాలకు కూడా సీఎం కేసీఆర్ రాకపోవటం సిగ్గుచేటన్నారు. జూన్ 3, 4 తేదీల్లో హైదరాబాద్లో జరిగే జాబ్ మేళాకు భారీగా హాజరు కావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి :
- టిప్పు సుల్తాన్ ఖడ్గం వేలం… 144 కోట్లు పలికి ఆశ్చర్యపరిచిన కత్తి
- చెరువులో డ్రమ్ములో మృతదేహాం… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- నాలుగు నెలల్లో వివాహం… కాబోయే భార్యను కాపాడబోయి యువకుడి మృతి…
- రోజు కూలీ బ్యాంకు ఖాతాలోకి వచ్చిపడ్డ రూ.100 కోట్లు.. ఇంతలో షాకిచ్చిన పోలీసులు
- ‘డిసీజ్ ఎక్స్’… డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన మరో మహమ్మారి ఇదేనా?
One Comment