
క్రైమ్ మిర్రర్, నల్గొండ జిల్లా ప్రతినిధి : నల్గొండ జిల్లాలో బాలిక ఇంటికి వెళ్లిన బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్రంపోడు మండలం కొప్పోలుకు చెందిన బాలిక నల్గొండలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉండి పదోతరగతి చదువుతోంది. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం దుగినెల్లి వాసి, ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. అతడు ప్రేమ పేరిట ఆమె వెంటపడుతున్నాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో గొడవ జరిగింది. బాలికను పేరెంట్స్ ప్రశ్నించడంతో అతడు తనను వేధిస్తున్నట్లు చెప్పింది. నాలుగు నెలల క్రితం బాలిక తల్లిదండ్రులు షీటీమ్‌ను ఆశ్రయించారు.
Read Also : ‘కొత్త సచివాలయం అద్భుతం.. కానీ..’ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు
ఇద్దరి తల్లిదండ్రులు, పెద్ద మనుషుల్ని పిలిచి.. ఒకరి జోలికి ఒకరు వెళ్లకుండా ఉండాలని రాజీ కుదిర్చారు. సంతోష్ తల్లిదండ్రులు ఉపాధి కోసం సూరత్ వెళ్లారు. బాలుడు అక్క దగ్గర ఉంటున్నాడు. ఇంతలో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో బాలిక ఊరిలో ప్రత్యక్షమయ్యాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి బాలిక ఇంట్లోకి వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక నాయనమ్మ బయటి నుంచి తలుపు గడియ పెట్టింది. బాలిక తండ్రిని పిలిచింది.. వారిద్దరూ తలుపు తీశారు. అక్కడే ఉన్న బాలుడిని కర్రలతో కొట్టారు.
Also Read : కరాటే కళ్యాణిపై ‘మా’ క్రమశిక్షణా చర్యలు… సస్పెన్షన్ వేటు, సభ్యత్వం రద్దు
వారి నుంచి తప్పించుకుని పారిపోతున్నా వెంబడించి కొట్టారు. అతడికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయాడు. నల్గొండ హైస్కూలులో చదివేటప్పుడే అతడికి ఆ బాలిక పరిచయం ఉందని చెబుతున్నారు. ఆమె కుటుంబసభ్యులు గతంలోనే బాలుడిని హెచ్చరించారట. పెద్దలు చెప్పినా వినకపోవడం.. ఓ బాలిక వెంటపడటంతో ఆమె కుటుంబ సభ్యులు దాడి చేశారని చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- ధూంధాంగా దశాబ్ది ఉత్సవాలు.. ఖర్చుల కోసం 105 కోట్లు విడుదల చేసిన కేసీఆర్
- నల్గొండ ఐటీ టవర్ లో 200 ఉద్యోగాలు.. ప్రకటించిన సొనాటా సాఫ్ట్ వేర్
- బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి జాతీయ అవార్డు.. బాలకృష్ణకు చంద్రబాబు అభినందనలు
- మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు ఇండియన్ రైల్వే అద్భుత నివాళి.. రైలుకు మేజర్ పేరు
- కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో ప్రతిపక్షాలకు మోదీ చురకలు
One Comment