
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : వివాహ క్రతువు ముగిసిన కాసేపటికే వధువు తండ్రి పెళ్లి మండపంలో.. కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలి మృతి చెందాడు. అప్పటిదాకా కళకళలాడిన పెళ్లి మండపం మూగబోయింది. బంధువులు, స్నేహితులు విషాదంలో కూరుకుపోయారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. గోదావరిఖనిలోని విఠల్ నగర్‌కు చెందిన ఎలిగేటి శంకర్ (55)కు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు వివాహాన్ని బుధవారం స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిపించాడు.
Read Also : హైదరాబాద్‌లో దారుణ ఘటన… మహిళను చంపి, శరీరభాగాలను ఫ్రిజ్‌లో దాచిన ఇంటి యజమాని
పెళ్లి క్రతువు ముగిసిన తర్వాత శంకర్.. మండపం అంతా కలియ తిరుగుతూ బంధువులు, స్నేహితులను పలుకరించారు. ఆ తర్వాత కాస్త అలసటగా ఉందంటూ మండపంల సమీపంలో ఓ కుర్చీలో కూర్చున్నారు. కాసేపటికే కూర్చున్న కుర్చీలో అలాగే వాలిపోయారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆయణ్ని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శంకర్‌ను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కుమార్తె వివాహాన్ని కళ్లారా చూశారు. గుండె భారాన్ని కాస్త దించుకున్నారు.
Also Read : జీవో 111 ఎత్తివేత పెద్ద మోసం… టీపీసీసీ రేవంత్ కీలక కామెంట్స్
ఆ తర్వాత కాసేపటికే శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. శంకర్ మృతితో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. నవ వధువు, భార్య, కుమారుడి రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. పెళ్లి వేడుక కాస్తా విషాదంగా మారింది. శంకర్ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని బంధువులు చెబుతున్నారు. ఆ కారణంగానే మృతి చెంది ఉంటాడని చెబుతున్నారు. అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ఉంటారని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- ఒకే కాన్పులో ఐదుగురు.. అందరూ ఆడపిల్లలే.. అదీ సాధారణ ప్రసవం!
- పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దూరంగా విపక్షాలు.. ఉమ్మడి ప్రకటన
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం… కవిత, కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసిన సుఖేష్
- తండ్రి లేడు, తల్లి వంట మనిషి.. సివిల్స్‌లో సత్తా చాటిన కొడుకు
- హైదరాబాద్‌లో నకిలీ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్… ఉద్యోగాలు, సెటిల్మెంట్ల పేరుతో ప్రజలను బురిడీ
One Comment