
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలో ఈ ఏడాది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎంసెట్ 2023 పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. వీటిని పలు వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచారు. ఈనెల 10 నుంచి 14 వరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా విభాగాల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ నిర్వహించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు 3 లక్షలకు పైగా విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు.
Read Also : అమెరికాలో విషాదం… రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం
ఇవాళ విడుదలైన ఎంసెట్ ఫలితాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం www.ntnews.com, eamcet.tsche.ac.in అనే వెబ్ సైట్లను అందుబాటులో ఉంచింది. వీటిలో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను తెలుసుకునేందుకు వీలు కల్పించారు. వీటితో పాటు పలు ప్రైవేట్ సైట్లు కూడా ఫలితాలను అందుబాటులో ఉంచాయి. ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్ పరీక్షల్లో అగ్రికల్చర్ విభాగంలో 86 శాతం అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఇంజినీరింగ్ విభాగంలో 80 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌లో బాలురు 79 శాతం, బాలికలు 82 శాతం ఉత్తీర్ణత సాధఇంచారు. అగ్రికల్చర్ విభాగంలో బాలురు 84 శాతం, బాలికలు 87 శాతం ఉత్తీర్ణత పొందారు.
Also Read : కూతురు వివాహమైన కాసేపటికే… కూర్చున్న కుర్చీలోనే తండ్రి మృతి
అడ్మిషన్ ప్రక్రియ త్వరలో ప్రకటిస్తామని విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల విడుదల సందర్భంగా ప్రకటించారు. ఎంసెట్ పరీక్ష సాఫీగా నిర్వహణకు సహకరించిన అన్ని విభాగాలకు మంత్రి సబిత ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది నిర్ణీత సమయానికే ఫలితాలు ఇచ్చామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 21 జోన్లలో ఎంసెట్ పరీక్ష నిర్వహించామని, మే 10 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించామని సబిత వెల్లడించారు. మరోవైపు ఇంజినీరింగ్‌లో అనిరుధ్ మొదటి ర్యాంకు , వెంకట మణిందర్ రెడ్డికి సెకండ్ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో బూరుగుపల్లి సత్య ఫస్ట్ ర్యాంక్, నాసిక వెంకటతేజ రెండో ర్యాంక్ సాధించారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో దారుణ ఘటన… మహిళను చంపి, శరీరభాగాలను ఫ్రిజ్‌లో దాచిన ఇంటి యజమాని
- జీవో 111 ఎత్తివేత పెద్ద మోసం… టీపీసీసీ రేవంత్ కీలక కామెంట్స్
- మరో మహమ్మారిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి.. ప్రపంచానికి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
- పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దూరంగా విపక్షాలు.. ఉమ్మడి ప్రకటన
- తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు ఏర్పాట్లు… 21 రోజుల పాటు వేడుకలు
One Comment