
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. దేశంలో ఉన్న బీజేపీయేతర పార్టీలన్నీ.. పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. దీనిపై ఆ పార్టీలు తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. తాజాగా ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్ష పార్టీలు రాకపోవడాన్ని తప్పుపడుతూ ఘాటు విమర్శలు చేశారు. జపాన్, పపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా పర్యటనలు ముగించుకుని.. ఢిల్లీకి చేరుకున్న మోదీ.. విపక్షాలను ఉద్దేశించి పరోక్షంగా తీవ్రంగా మండిపడ్డారు.
Read Also : ఫేక్ బాబా… పూజల పేరుతో బలవంతపు వసూళ్లు, అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులతో జరిగిన సభలో 20 వేల మంది పాల్గొన్నారని తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో పాటు మాజీ ప్రధాని, ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు, వివిధ నేతలు హాజరయ్యారని చెప్పారు. తమ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆ సమావేశంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. ఆ కార్యక్రమానికి ఆ దేశంలోని అధికార, ప్రతిపక్షాలు కలిసికట్టుగా హాజరే ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారని ప్రధాని పేర్కొన్నారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని దేశంలోని ప్రతిపక్షాలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మోదీ ఇలా పరోక్షంగా వాగ్బాణాలు సంధించారు.
Also Read : తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాలు విడుదల…
దేశంలో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న వేళ విదేశాలకు వ్యాక్సిన్లు పంపించడంపై అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుపట్టిన విషయాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచ దేశాలకు మోదీ ఎందుకు వ్యాక్సిన్లు ఎగుమతి చేస్తున్నారని ప్రశ్నించినట్లు గుర్తు చేశారు. భారత దేశం బుద్ధుడు, గాంధీ తిరిగిన నేల అని.. భారతీయులు శత్రువుల మేలు గురించి కూడా ఆలోచిస్తామని తెలిపారు. ఈ నెల 28న పార్లమెంటు కొత్త భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూను ఆహ్వానించకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
Read Also : అమెరికాలో విషాదం… రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం
రాష్ట్రపతి లేకుండా పార్లమెంట్ కొత్త భవనాన్ని ఎలా ప్రారంభిస్తారని నిలదీస్తుండగా.. గతంలో పార్లమెంటులోని వివిధ భవనాలకు అప్పటి ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలే ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారని బీజేపీ నేతలు తిప్పికొడుతున్నారు. బీజేపీ తీరుకు నిరసనగా.. 20 పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రారంభోత్సవానికి హాజరుకామని 19 ప్రతిపక్ష పార్టీలు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేయడంపై బీజేపీ సహా 14 ఎన్‌డీఏ కూటమిలోని పార్టీలు స్పందించాయి. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను ప్రతిపక్షాలు.. అవహేళన చేస్తున్నాయంటూ ప్రకటన విడుదల చేశాయి. అయితే శిరోమణి అకాలీదళ్, వైసీపీ, బిజూ జనతాదళ్, టీడీపీ పార్టీలు మాత్రం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి హాజరవుతామని తెలిపాయి.
ఇవి కూడా చదవండి :
- కూతురు వివాహమైన కాసేపటికే… కూర్చున్న కుర్చీలోనే తండ్రి మృతి
- మరో మహమ్మారిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి.. ప్రపంచానికి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
- ఒకే కాన్పులో ఐదుగురు.. అందరూ ఆడపిల్లలే.. అదీ సాధారణ ప్రసవం!
- పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దూరంగా విపక్షాలు.. ఉమ్మడి ప్రకటన
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం… కవిత, కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసిన సుఖేష్
2 Comments