
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రముఖ ఇంజినీరింగ్ కంపెనీ అయిన సొనాటా సాఫ్ట్‌వేర్ తెలంగాణలోని టైర్-II పట్టణాల్లో తమ కంపెనీలను విస్తరిస్తోంది. నల్గొండ IT టవర్‌లో 200 ఉద్యోగాలను కల్పించడం ద్వారా త్వరలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ మేరకు Sonata సాఫ్ట్‌వేర్ ఈవీపీ శ్రీని వీరవెల్లి ప్రకటన చేశారు. అమెరికాలోని బోస్టన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ ఇన్నోవేషన్‌పై దృష్టి సారిస్తూ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ వంటి విస్తృత శ్రేణి పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వినూత్న పరిష్కారాలపై పని చేయడానికి తమ సంస్థ కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
Read Also : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి జాతీయ అవార్డు.. బాలకృష్ణకు చంద్రబాబు అభినందనలు
సొనాటా సాఫ్ట్‌వేర్ ఎండ్-టు-ఎండ్ ఇండస్ట్రీ-ఫోకస్డ్ సొల్యూషన్‌లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంపై పని చేస్తోంది. ఇందులో భాగంగా నల్గొండ పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో కంపెనీని విస్తేరించేందకు ప్రయత్నాలు చేస్తోంది. కేటీఆర్ తో జరిగిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ విష్ణువర్ధన్‌రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి పాల్గొన్నారు. గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం సనోఫీ నాయకత్వ బృందం హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తమ ప్రణాళికలను మంత్రి కేటీఆర్‌కు వివరించింది. కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లో 350 ఉద్యోగాలతో కేంద్రాన్ని ప్రారంభించింది.
Also Read : మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు ఇండియన్ రైల్వే అద్భుత నివాళి.. రైలుకు మేజర్ పేరు
హైదరాబాద్ కేంద్రం తమ గ్లోబల్ ‘టాలెంట్ హబ్స్’లో ఒకటని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో సనోఫీ గ్లోబల్ హబ్‌ను ఏర్పాటు చేయడం మన విస్తృత లైఫ్ సైన్సెస్ వ్యూహాన్ని మరింతగా పెంచుతుందని కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే ‘హెల్త్ టెక్ మక్కా’గా అవతరించేందుకు కృషి చేస్తున్న హైదరాబాద్ నాయకత్వ పాత్రలో ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేటీఆర్ పెట్టుబడులను ఆకర్షించేందుకు విదేశాల్లో పర్యటిస్తున్నారు. కేటీఆర్ తో పాటు ఐటీ, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ విష్ణువర్ధన్ రెడ్డి, తెలంగాణ లైఫ్‌సైన్సెస్ సీఈవో శక్తి ఎం నాగప్పన్ ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
- కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో ప్రతిపక్షాలకు మోదీ చురకలు
- ఫేక్ బాబా… పూజల పేరుతో బలవంతపు వసూళ్లు, అదుపులోకి తీసుకున్న పోలీసులు
- తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాలు విడుదల…
- అమెరికాలో విషాదం… రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం
- కూతురు వివాహమైన కాసేపటికే… కూర్చున్న కుర్చీలోనే తండ్రి మృతి
One Comment