
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్.. ఈ పేరు విన్నంతనే ప్రతి భారతీయుడి గుండె ఉప్పొంగుతుంది. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. టెర్రరిస్టులపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. 10 మంది పాకిస్తానీ టెర్రరిస్టులు పిస్టళ్లు, ఏకే47లు, బాంబులు, గ్రెనేడ్లు ఇతర పేలుడు పదార్థాలతో ముంబయి పై విరుచుకుపడ్డారు. వారు అప్పుడు మారణహోమం సృష్టించారు. విదేశీయులను తాజ్ ప్యాలెస్ లో బందీలుగా పట్టుకున్నారు. 60 గంటల పాటు కొనసాగిన ఈ దాడుల్లో 160 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. గాయాలపాలైనవారి సంఖ్య వందల్లో ఉంటుంది.
Read Also : కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో ప్రతిపక్షాలకు మోదీ చురకలు
తాజ్ ప్యాలెస్ లో దాగిన ఉగ్రవాదులను ఏరి వేసేందుకు NSG రంగంలోకి దిగింది. ఈ టీమ్ లో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ కీలక పాత్ర పోషించారు. గదిలో చిక్కుకున్న ఓ మహిళా ఉద్యోగిని తీసకొస్తున్న క్రమంలో ఉగ్రవాదుల బుల్లెట్ ఉన్ని కృష్ణన్ శరీరంలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో సందీప్ తన సహచరుల గురించే ఆలోచించారు. ఎవరు ముందుకురావద్దని వాకీటాకీ ద్వారా మిగతావారిని హెచ్చరించి.. పౌరుల్ని, తన తోటి కమాండోలను, దేశ సమగ్రతను కాపాడే క్రమంలో ఉన్ని కృష్ణన్ వీరమరణం పొందారు. తద్వారా భారతీయుల గుండెల్లో అమరుడయ్యారు.
Also Read : ఫేక్ బాబా… పూజల పేరుతో బలవంతపు వసూళ్లు, అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆయన బలిదానానికి భారతీయ రైల్వే ఘనమైన నివాళి అర్పించింది. TKDWDP 48 40049 రైలుకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అశోక చక్ర అని నామకరణం చేసింది. ఉన్ని కృష్ణన్ ప్రాణ త్యాగానికి గుర్తుగా ప్రభుత్వం ఆయనకు అశోక చక్ర బిరుదునిచ్చి సన్మానించింది. తాజాగా భారతీయ రైల్వే ఓ రైలుకు ఆయన పేరు పెట్టింది. ఇటువంటి ఘనమైన నివాళులు గతంలో ఎవరికీ దక్కలేదు. ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో అడవిశేష్ ప్రధాన పాత్రలో మేజర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు శశికుమార్ దర్శకుడు. విడుదలైన అన్ని భాషల్లో మేజర్ ఘనవిజయం సాధించింది.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాలు విడుదల…
- అమెరికాలో విషాదం… రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం
- కూతురు వివాహమైన కాసేపటికే… కూర్చున్న కుర్చీలోనే తండ్రి మృతి
- మరో మహమ్మారిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి.. ప్రపంచానికి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
- హైదరాబాద్‌లో దారుణ ఘటన… మహిళను చంపి, శరీరభాగాలను ఫ్రిజ్‌లో దాచిన ఇంటి యజమాని
One Comment