
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : అమెరికాలో మరో విషాద ఘటన జరిగింది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో అగ్రరాజ్యం అమెరికా వెళ్లిన తెలంగాణ యువకుడి కలలు కల్లలయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడగా.. పాలమూరుకు చెందిన బోయ మహేష్ ప్రాణాలు కోల్పోయాడు.మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కప్పెటకు చెందిన బోయ వెంకట్రాములు, శకుంతల దంపతుల పెద్ద కుమారుడు మహేష్ బీటెక్ పూర్తి చేశాడు. మహేష్ గతేడాది డిసెంబరు 29న ఎంఎస్ చదివేందుకు అమెరికాలోని మిన్నెసోటా వెళ్లాడు. మంగళవారం స్నేహితులతో కలిసి మహేష్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో మహేష్ ప్రాణాలు కోల్పోయాడు. అదే కారులో ఉన్న మరో ముగ్గురు మహేష్ స్నేహితులు గాయాలతో బయటపడ్డారు.
Read Also : కూతురు వివాహమైన కాసేపటికే… కూర్చున్న కుర్చీలోనే తండ్రి మృతి
మహేష్ మరణవార్తను స్నేహితులు ఆయన తండ్రి వెంకట్రాములుకు మంగళవారం రాత్రి ఫోన్ చేసి చెప్పారు. మహేష్ తండ్రి వెంకట్రాములు మహారాష్ట్రలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.. మధ్య తరగతి కుటుంబం. కుమారుడు ఉన్నత విద్య అభ్యసించి అండగా నిలుస్తాడని తల్లిదండ్రులు భావించారు. కానీ ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. మహేష్ మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మహేష్ మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అమెరికాలోని ఆటా సంస్థ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్‌లో దారుణ ఘటన… మహిళను చంపి, శరీరభాగాలను ఫ్రిజ్‌లో దాచిన ఇంటి యజమాని
- జీవో 111 ఎత్తివేత పెద్ద మోసం… టీపీసీసీ రేవంత్ కీలక కామెంట్స్
- ఒకే కాన్పులో ఐదుగురు.. అందరూ ఆడపిల్లలే.. అదీ సాధారణ ప్రసవం!
- పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దూరంగా విపక్షాలు.. ఉమ్మడి ప్రకటన
- మరో మహమ్మారిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి.. ప్రపంచానికి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
One Comment