
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి జాతీయ అవార్డుకి ఎంపికైంది. ఇండియాలోనే రెండో అత్యుత్తమ ఆంకాలజీ ఆసుపత్రిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని అవుట్ లుక్ ఇండియా మ్యాగజైన్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసుపత్రి ఛైర్మన్ నందమూరు బాలకృష్ణ, వైద్య సిబ్బందిని అభినందించారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు ప్రాణం పోసింది.
Read Also : మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కు ఇండియన్ రైల్వే అద్భుత నివాళి.. రైలుకు మేజర్ పేరు
సినీహీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఛైర్మన్‌గా ఉండి ఈ ఆసుపత్రిని నడిపిస్తున్నారు. ఈ హాస్పిటల్ ద్వారా చాలా మందికి ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి నయమైంది. హైదరాబాద్ కేంద్రంగా కొన్ని దశాబ్దాలుగా వేలాది క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తోంది. అలాంటి ఆసుపత్రికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్ చేయటంలో ఆసుపత్రి సిబ్బంది చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.
Also Read : కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం విషయంలో ప్రతిపక్షాలకు మోదీ చురకలు
తక్కువ ఖర్చుతో ప్రపంచస్థాయిలో క్యాన్సర్ చికిత్సను ఈ ఆసుపత్రి అందిస్తుందని చంద్రబాబు అన్నా్రు. వృత్తిపరమైన నిబద్ధతతో, రోగుల పట్ల దయతో వ్యవహరిస్తూ.. వారి పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటూ, అత్యాధునిక క్యాన్సర్ చికిత్స విధానాలు, చికిత్స వ్యవస్థలను పేదలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని కొనియాడారు. క్యాన్సర్ వ్యాధి చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని.., ఆ ఖర్చు భరించలేని వారికి బసవతారకం ఆసుపత్రి ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- ఫేక్ బాబా… పూజల పేరుతో బలవంతపు వసూళ్లు, అదుపులోకి తీసుకున్న పోలీసులు
- తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాలు విడుదల…
- అమెరికాలో విషాదం… రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం
- కూతురు వివాహమైన కాసేపటికే… కూర్చున్న కుర్చీలోనే తండ్రి మృతి
- జీవో 111 ఎత్తివేత పెద్ద మోసం… టీపీసీసీ రేవంత్ కీలక కామెంట్స్
One Comment