
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మోసపోయేవాడు ఉంటే.. మోసం చేసేవాళ్లకు ఈ దునియాలో కొదవే లేదు. తెలుగు సినిమాలోని ఈ డైలాగ్‌ను బాగా వంటపట్టించుకున్నట్లుంది ఈ కేటుగాడు. ఈజీ మనీ కోసం మోసాలకు తెగబడ్డాడు. ఏకంగా దేశగురువు అవతారమెత్తి తనను తాను బాబాగా చెప్పుకుంటున్నాడు. గ్రామాల్లో తిరుగుతూ.. ఇంటింటింటికి డబ్బులు వసూలు చేస్తున్నాడు. మీకు చెడుదోశం ఉంది, కీడు వచ్చింది అంటూ ప్రత్యేక పూజల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఓ కేటుగాడు దేశగురువు రూపంలో ప్రత్యేక్షమయ్యాడు.
Read Also : తెలంగాణ ఎంసెట్-2023 ఫలితాలు విడుదల…
విచిత్రమైన వేషదారణ, గుర్రంపై స్వారీ చేస్తూ గ్రామాల్లో సంచరిస్తున్నాడు. డప్పు చాటింపు వేయించి మరీ ఇంటింటికి తిరుగుతూ పూజల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. పెద్దమెుత్తంలో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. మీ ఇంట్లో అరిష్టం, దోశం ఉందని ఇంటికి వచ్చి పూజలు చేస్తానని అందుకు కట్నం సమర్పించుకోవాలని బేరాలు ఆడుతున్నాడు. ఇలా ప్రతి ఇంటికి రూ.500 నుంచి రూ.5 వేల వరకు పూజల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నాడు. అసలే పనుల్లేక అల్లాడుతుంటే.. వీడెవడో వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని కొందరు గ్రామస్థులు వాపోతున్నారు.
Also Read : అమెరికాలో విషాదం… రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి దుర్మరణం
ఈ దేశగురువు యవ్వారాన్ని (యాపారాన్ని) పోలీసులకు తెలియజేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఆ దొంగ బాబాను అదుపులోకి తీసుకొని బైండోవర్ చేశారు. బురిడీ బాబాను నమ్మొద్దని వేములవాడ ఎస్‌ఐ నాగరాజు ప్రజలకు సూచించారు. ఈ మధ్య కాలంలో కొందరు గురువులమని చెప్పి.. బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ఎవరైనా పూజల పేరుతో డబ్బులు వసూలు చేస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
- కూతురు వివాహమైన కాసేపటికే… కూర్చున్న కుర్చీలోనే తండ్రి మృతి
- మరో మహమ్మారిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి.. ప్రపంచానికి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
- ఒకే కాన్పులో ఐదుగురు.. అందరూ ఆడపిల్లలే.. అదీ సాధారణ ప్రసవం!
- హైదరాబాద్‌లో దారుణ ఘటన… మహిళను చంపి, శరీరభాగాలను ఫ్రిజ్‌లో దాచిన ఇంటి యజమాని
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం… కవిత, కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసిన సుఖేష్
3 Comments