
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. అలాంటి వేడుకను తమ ఆర్థిక స్థితికి తగ్గట్లుగా వైభవంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇక నేటి తరం యువత పెళ్లిలో గతానికి భిన్నంగా కొత్తదనం ఉండాలని కోరుకుంటున్నారు. తమదైన మార్కుతో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ప్రీ వెడ్డింగ్ షూట్‌ల నుంచి మంగళ స్నానాలు, సంగీత్‌ల వరకు అందరికంటే భిన్నంగా వెరైటీగా ఉండాలనుకుంటున్నారు. తమ క్రియేటివిటీని ఉపయోగించి ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఇక పెళ్లిలో ఆహ్వాన పత్రిలది ప్రత్యేక స్థానం.
Read Also : ఐపీఎల్- 2023 మ్యాచ్‌ల నిర్వహణ భేష్… రాజకొండ పోలీసులకు సన్ రైజర్స్ బృందం కృతజ్ఞతలు
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగే వేడుకకు శుభలేఖలు ముద్రించి వాటిని ఇచ్చి పిలవడం మన దగ్గర తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. అలాంటి శుభలేఖలను వైరైటీగా ప్రింట్ చేయిస్తున్నారు నేటి తరం యువత. అదిరిపోయే ఐడియాలతో..అందరికీ గుర్తుండేలా పెళ్లి పత్రికలను ప్రింట్ చేయిస్తున్నారు. కరీంనగర్ జిల్లా మల్యాలకు చెందిన ఓ యువకుడు కూడా అదే చేశాడు. పక్కా తెలంగాణ యాసలో కార్డ్ ప్రింట్ చేయించాడు. ఫోక్ సాంగ్స్ రైటర్, సింగర్‌గా రాణిస్తున్న పొన్నం మహేష్ గౌడ్ అనే యువకుడు తన ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ పేరునే ఇంటిపేరుగా మార్చుకొని స్థానికంగా గుర్తింపు పొందాడు. ఇటీవల అతడికి పెళ్లి నిశ్చయం కాగా.. ఇవాళ (మే 24) ముహుర్తం. ఇక తెలంగాణ భాష, యాస ఉట్టిపడేలా వినూత్నంగా తన వెడ్డింగ్ కార్డును ప్రింట్ చేయించాడు మహేశ్ గౌడ్.
Also Read : ఇదేం విచిత్రం.. చిన్నారి కంటి నుంచి ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ముక్కలు!
‘పొన్నం వోల్ల లగ్గం పిలుపు’ అంటూ తన సృజనాత్మకతను ఉపయోగించి పెళ్లి ఆహ్వాన పత్రిక ముద్రించి పంచారు. తెలంగాణ యాసలో ఉన్న పెళ్లి పత్రిక చూసిన మహేశ్ బంధువులు, మిత్రలు అతడి క్రియేటివిటికి ఫిదా అయిపోయారు. ప్రస్తుతం మహేశ్ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే గతంలోనూ ఇలాంటి వెడ్డింగ్ కార్డులను పలువురు ప్రింట్ చేయించారు. మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయిన అనిల్ తన పెళ్లి పత్రికను కూడా ఇలాగే ప్రింట్ చేయించాడు. కరోనా సమయంలో అతడు పెళ్లి చేసుకోగా.. అప్పట్ల ో ఆ కార్డు తెగ వైరల్ అయింది.
ఇవి కూడా చదవండి :
- కొత్త సెక్రటేరియట్ భద్రతకు ప్రాధాన్యత.. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు సీఐలతో నూతన పోలీస్ స్టేషన్
- ‘మా నాన్న తాగొచ్చి.. అమ్మను కొడుతుండు’.. పోలీసులకు చిన్నారి ఫిర్యాదు
- రంగారెడ్డి జిల్లాలో దారుణం… భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్
- తెలంగాణలో ఈ “బండి”తో గెలవలేం.. అమిత్ షాకు ఈటల సంచలన రిపోర్ట్..?
- యూట్యూబర్ హర్షసాయి టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం.. మిత్రా శర్మ కాంబోలో గ్రాండ్ ఎంట్రీ!
One Comment