
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలకు ఓ మహిళ జన్మనిచ్చింది. ఆమెకు సాధారణ ప్రసవం జరగడం మరో విశేషం. అరుదైన ఈ సంఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకుంది. రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆస్పత్రిలో సోమవారం ఓ మహిళ ఐదుగురు శిశువులకు జన్మనిచ్చిందని, వారంతా బాలికలేనని వైద్యులు ట్విట్టర్‌లో తెలిపారు. సాధారణం కంటే తక్కువ బరువుతో పుట్టినందున నియోనాటల్ ఐసీయూలో వారిని సంరక్షించినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఛత్రా జిల్లాలోని ఇత్కోరీకి చెందిన ఆ మహిళకు రిమ్స్ వైద్యుడు శశిబాలసింగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం సాధారణ ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లి పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. రిమ్స్ రాంచీ తన అధికారి ట్విట్టర్ ఖాతాలో ఫోటోను షేర్ చేస్తూ.. తమ ఆస్పత్రి చరిత్రలోనే ఇటువంటి అరుదైన సంఘటన జరగడం ఇదే మొదటిసారని తెలిపింది.
Read Also : పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దూరంగా విపక్షాలు.. ఉమ్మడి ప్రకటన
‘ఛత్రాకు చెందిన మహిళ గైనకాలజీ విభాగం వైద్యుల పర్యవేక్షణలో సాధారణ ప్రసవంతో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది.. ప్రస్తుతం నవజాత శిశువులను ఎన్ఐసీయూలో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.. డాక్టర్ శశి బాలా సింగ్ నేతృత్వంలోని వైద్యుల బృందం విజయవంతంగా మహిళకు కాన్పు చేసింది’ అని ట్విట్టర్‌లో పేర్కొంది. ఒకే కాన్పులో జన్మించిన ఐదుగురు పిల్లలను క్వింటాప్లెట్స్ అని పిలుస్తారు. ఇలా 55,000,000 జననాలలో ఒకటి అరుదుగా జరుగుతుంది. చాలా మట్టుకు క్వింటాప్లెట్స్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు ఉంటారు. పూర్తిగా మగ లేదా ఆడ పిల్లలు చాలా అరుదు ఉంటారు. ఇటువంటి చాలా అరుదుగా ఉన్నప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో ఒకే కాన్పులో ముగ్గురు నలుగురు పిల్లలు సర్వసాధారణంగా మారాయి.
Also Read : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం… కవిత, కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసిన సుఖేష్
ఎందుకంటే గర్భధారణలో ఎక్కువ మంది సంతానోత్పత్తి ఔషధాలు, ఐవీఎఫ్ వంటి విధానాలను అవలంభిస్తున్నారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. బహుళ గర్భధారణకు రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి. మొదటిది ఫలదీకరణ జరిగిన తర్వాత గర్భాశయంలోకి చేరడానికి ముందు అండం విడిపోతుంది. రెండోది రెండు లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు అండాలు ఒకే సమయంలో వేర్వేరు వీర్య కణాల ద్వారా ఫలదీకరణం చెందుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో పోలిష్-బ్రిటీష్ దంపతులు కూడా ఒకే కాన్పులో ఏడుగురు పిల్లలను కన్నారు. గర్బం దాల్చిన 29 వారాల తర్వాత సిజేరియన్ చేసి పిల్లలను బయటకు తీశారు. ఇప్పటికీ ఆ పిల్లలకు కృత్రిమ శ్వాసను అందజేస్తున్నారు. ఇక, 1934లో కెనడాలో జన్మించిన డియోన్నే సమరూప కవలలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
ఇవి కూడా చదవండి :
- తండ్రి లేడు, తల్లి వంట మనిషి.. సివిల్స్‌లో సత్తా చాటిన కొడుకు
- హైదరాబాద్‌లో నకిలీ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్… ఉద్యోగాలు, సెటిల్మెంట్ల పేరుతో ప్రజలను బురిడీ
- తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు ఏర్పాట్లు… 21 రోజుల పాటు వేడుకలు
- వెరైటీగా వెడ్డింగ్ కార్డు… తెలంగాణ యాసలో ప్రింట్ చేయించిన యువకుడు, సోషలో మీడియాలో వైరల్
- రూ.2 వేల నోటు ఉపసంహరణపై సీతక్క కామెంట్… సోషల్ మీడియాలో రచ్చ
One Comment