
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత టార్గెట్‌గా జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తన అడ్వకేట్ ద్వారా మరో లేఖ విడుదల చేశారు. ఐదు పేజీల ఈ లేఖలో కవిత, అరవింద్ కేజ్రీవాల్‌పై సుఖేష్ సంచలన ఆరోపణలు చేశాడు. కవిత సెల్ కంపెనీల ఖాతాల నుంచి రూ.80 కోట్ల నిధులు మళ్లించినట్లు బాంబు పేల్చాడు. ఈ నిధులను మారిషస్‌కు మళ్లించినట్లు ఆరోపించాడు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాడు. ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు చెందిన గ్రీన్ హస్క్ కంపెనీలకు రూ.80 కోట్లు తరలించినట్లు సుఖేష్ తెలిపాడు. కైలాష్ గెహ్లాట్ బంధువుల ఖాతాలకు నగదు బదిలీ చేసినట్లు చెప్పాడు.
Read Also : తండ్రి లేడు, తల్లి వంట మనిషి.. సివిల్స్‌లో సత్తా చాటిన కొడుకు
25+25+30 కోట్లు నగదు బదిలీలు జరిగాయని, నగదు బదిలీలపై కేజ్రీవాల్ చాట్స్ వివరాలను కూడా త్వరలోనే విడుదల చేస్తానన్నాడు. వాస్తవాలను బయటపెడుతున్నందుకే తనను మానసికంగా వేధిస్తున్నారని, తమకు అనుకూలమైన జైలు అధికారులతో వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించాడు. వేధింపులపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నిర్మాణంపై సుఖేష్ చంద్రశేఖర్ పలు ఆరోపణలు చేశాడు. కేజ్రీవాల్ ఇంటి ఫర్నిచర్ ఖర్చులను తానే భరించానని, ఫర్నిచర్ బిల్లులు తన దగ్గర ఉన్నాయని తెలిపాడు. త్వరలో కేజ్రీవాల్‌కు సంబంధించిన మరో కుంభకోణాన్ని బయటపెడతానని అన్నాడు. కేజ్రీవాల్ ఫేస్‌టైమ్ చాట్‌ల స్క్రీన్‌షాట్‌లను విడుదల చేస్తానని, కేజ్రీవాల్ సూచనలతోనే తాను రూ.80 కోట్లు బదిలీ చేసినట్లు సుఖేష్ చెప్పాడు.
Also Read : హైదరాబాద్‌లో నకిలీ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్… ఉద్యోగాలు, సెటిల్మెంట్ల పేరుతో ప్రజలను బురిడీ
నగదును యూఎస్‌బీటీ, క్రిప్టో కరెన్సీకి మార్చడిందని, కేజ్రీవాల్ సూచనతోనే అబుదాబికి నగదు పంపారని సుఖేష్ చంద్రశేఖర్ లేఖ ద్వారా చెప్పుకొచ్చాడు. అయితే గతంలోనూ కవిత పాత్రకు సంబంధించి రెండు లేఖలను సుఖేష్ విడుదల చేశాడు. కవితతో తాను వాట్సప్‌లో ఛాట్ చేసిన స్క్రీన్‌షాట్లను కూడా బయటపెట్టాడు. ఈ వాట్సప్ ఛాట్‌లో నిధుల లావాదేవీలకు సంబంధించి కోడ్ భాషలో కవిత, సుఖేష్ మాట్లాడుకున్నారు. సుఖేష్ వ్యాఖ్యలను కవిత ఖండిస్తూ వస్తున్నారు. అతడెవరో తనకు అసలు తెలియదని, వాట్సప్ ఛాట్‌లు ఫేక్ అని చెప్పారు. కాగా లిక్కర్ స్కాంలో కవిత ఇప్పటికే సీబీఐ, ఈడీ విచారణకు హాజరయ్యారు. కవిత ఫోన్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఇవి కూడా చదవండి :
- మరో మహమ్మారిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలి.. ప్రపంచానికి డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
- తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు ఏర్పాట్లు… 21 రోజుల పాటు వేడుకలు
- వెరైటీగా వెడ్డింగ్ కార్డు… తెలంగాణ యాసలో ప్రింట్ చేయించిన యువకుడు, సోషలో మీడియాలో వైరల్
- ఐపీఎల్- 2023 మ్యాచ్‌ల నిర్వహణ భేష్… రాజకొండ పోలీసులకు సన్ రైజర్స్ బృందం కృతజ్ఞతలు
- రూ. 2 వేల నోట్ల ఉపసంహరణ వెనుక కుట్ర, ఇదంతా వారికోసమే : మంత్రి జగదీశ్ రెడ్డి
3 Comments