
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ ప్రతినిధి : గతేడాది దేశ రాజధాని ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే 27 ఏళ్ల యువతిని తన బాయ్ ఫ్రెండ్ హత్య చేసి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో దాచడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెతో సహజీవనం చేస్తున్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడు శ్రద్ధా గొంతు కోసి చంపేశాడు. ఆపై 35 ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్‌లో దాచాడు. అచ్చం అలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆరు రోజుల క్రితం హైదరాబాద్ చాదర్‌ఘాట్ ప్రాంతంలో ఓ మెుండెం లేని తలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు తలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Read Also : జీవో 111 ఎత్తివేత పెద్ద మోసం… టీపీసీసీ రేవంత్ కీలక కామెంట్స్
అసలు ఆ తల ఎవరిది ? ఆమెను ఎవరు, ఎందుకు చంపారనే కోణంలో దర్యాప్తు చేశారు. తాజాగా..ఈ కేసును పోలీసులు చేధించగా.. సంచనల విషయాలు వెలుగులోకి వచ్చాయి. దిల్లీలో జరిగిన శ్రద్దావాకర్ హత్య తరహాలో జరిగిన ఈ హత్య వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చనిపోయిన మహిళ ఎర్రం అనురాధగా పోలీసులు గుర్తించారు. ఆమె నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. చైతన్యపురిలోని చంద్రమౌళి అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటూ రోజు విధులకు హాజరయ్యేది. వడ్డీ వ్యాపారం చేసే అనురాధను ఇంటి యజమాని చంద్రమౌళినే చంపేశాడని తేలింది. సుమారు రూ. 6 లక్షలను అనురాధ చంద్రమౌళికి అప్పుగా ఇచ్చింది. అయితే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే చంద్రమౌళి ఆ డబ్బును నష్టపోయాడు.
Also Read : ఒకే కాన్పులో ఐదుగురు.. అందరూ ఆడపిల్లలే.. అదీ సాధారణ ప్రసవం!
తన డబ్బు తిరిగి ఇవ్వాలని అనురాధ ఒత్తిడి తేగా.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే అనురాధను చంద్రమౌళి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇంట్లోని ఫ్రిజ్‌లో దాచాడని పోలీసులు గుర్తించారు. ఆమె తలను మాత్రం చాదర్ ఘాట్ ప్రాంతంలోని మూసీ నదిలో పడేశాడు. చంద్రమోహన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతని ఇంట్లో దాచిపెట్టిన శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలను సేకరించారు. అయితే ఈ హత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. భయంగొల్పే రితీలో మహిళను హత్య ఆపై ఆమె శరీరభాగాలను ఫ్రిజ్‌లో దాయటం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి :
- పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి దూరంగా విపక్షాలు.. ఉమ్మడి ప్రకటన
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక పరిణామం… కవిత, కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసిన సుఖేష్
- తండ్రి లేడు, తల్లి వంట మనిషి.. సివిల్స్‌లో సత్తా చాటిన కొడుకు
- హైదరాబాద్‌లో నకిలీ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్… ఉద్యోగాలు, సెటిల్మెంట్ల పేరుతో ప్రజలను బురిడీ
- తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు ఏర్పాట్లు… 21 రోజుల పాటు వేడుకలు
2 Comments