
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జన్వాడ గ్రామంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ తన భార్యను కొబ్బరిబోండాల కత్తితో కిరాతంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను చంపేందుకు యత్నించాడు. వారు తప్పించుకొని ఇంటినుంచి పారిపోగా.. విషం తాగి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జన్వాడకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మన్నెగడ్డలో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా సేవలందిస్తున్నాడు. అతనికి భార్య సుధ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గతరాత్రి (మే 19న) దంపతుల మధ్య గొడవ జరిగింది.
Read Also : మహారాష్ట్రలో బీఆర్ఎస్ తొలి విజయం.. సంబురాల్లో గులాబీ శ్రేణులు
భార్యభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రంగా దూషించుకున్నారు. విచక్షణ కోల్పోయిన నాగరాజు కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో సుధపై దాడి చేశాడు. కిరాతకంగా ఆమెను నరికి చంపాడు. ఆ తర్వాత పిల్లలను చంపేందుకు కూడా యత్నించాడు. తలగడ సాయంతో వారికి ఊపిరాడకుండా చేసి చంపాలని చూశాడు. ఆ పెనుగులాటలో పిల్లలు తప్పించుకొని ఇంటి నుంచి పారిపోయారు. అనంతరం కాసేపటికే తాను కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నారుల ద్వారా విషయం తెలుసుకున్న స్థానికులు.. ఇంట్లోకి వెళ్లి చూడగా.. అప్పటికే నాగరాజు, సుధ విగతజీవులుగా పడి ఉన్నారు.
Also Read : మొదలైన డిపాజిట్లు… రూ.2 వేల నోట్లతో ఏటీఎం సెంటర్లకు జనం పరుగులు
సమాచారం అందుకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపగా.. తల్లిదండ్రులను కోల్పోయి ఇద్దరు చిన్నారు అనాథలుగా మిలిగిలపోయారు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజమని.. కూర్చుని మాట్లాడుకుంటే సమసిపోయే వివాదాలను పెద్దదిగా చేసుకొని ఇలా ప్రాణాలు తీయటం, ప్రాణాలు తీసుకోవటం సరైంది కాదని స్థానికులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
- తెలంగాణలో ఈ “బండి”తో గెలవలేం.. అమిత్ షాకు ఈటల సంచలన రిపోర్ట్..?
- గుండెలు పిండేసే ఘటన.. కొడుకు మృతదేహాంతో బర్త్‌డే కేక్ కట్ చేపించిన పేరెంట్స్
- కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ పొంగులేటి.. చేరికకు ముహూర్తం ఫిక్స్!!
- పెళ్లైన 15 రోజులకే నవవధువు ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణం..!
- హనుమకొండ జిల్లాలో దారుణం.. వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి
One Comment